మాల్యాను చంపబోయి మాగుంటను చంపారు: నారాయణ సంచలనం
నెల్లూరు: నక్సలైట్లు విజయ్ మాల్యాను చంపాలని ప్రయత్నించి వీలుకాక మాగంటి సుబ్బిరామిరెడ్డిని చంపారని సిపిఐ నాయకుడు నారాయణ సంచలన ప్రకటన చేశారు. నెల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడారు.
విజయ్‌మాల్యాకు, మాగంటి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పారు. విజయ్‌మాల్యాకు కేంద్రం సహకరించిందని నారాయణ ఆరోపించారు. బ్యాంకర్లకు, విజయ్‌మాల్యాకు మధ్య గతంలో కాంగ్రెస్ మధ్యవర్తిత్వం నడిపిందన్నారు. దేశంలో బ్లాక్‌మనీ గ్యాంగ్‌లు ఎక్కువయ్యాయని ఆయన ఆరోపించారు. దొంగడబ్బును బంగారంగా మారుస్తున్నారని నారాయణ విమర్శించారు.

కాంగ్రెసు పార్టీలో ఉన్న సమయంలో మాగుంట సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపారు. అప్పట్లో ఈ సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మాగుంట సుబ్బరామిరెడ్డిని నక్సలైట్లు 1995 డిసెంబర్‌లో హత్య చేశారు.
నారాయణ గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయనకు అలాంటి వ్యాఖ్యలు చేయడం ఓ అలవాటుగా మారినట్లుంది.












Click it and Unblock the Notifications