గుడ్డోడు గూట్లో రాయేసినట్టు మాట్లాడుతున్నారు: పవన్ కళ్యాణ్‌పై నారాయణ
అమరావతి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ త్యేక హోదాపై గుడ్డోడు గూట్లో రాయేసినట్టు మాట్లాడుతున్నారే తప్ప, హోదా సాధించాలన్న అంకితభావంతో ఉన్నట్టు కనిపించడం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. గురువారం మధ్యాహ్నాం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో రెండున్నరేళ్లు ఊరించిన బీజేపీ ప్రభుత్వం ఏపీ ప్రజలను తీవ్రంగా మోసం చేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకు ఢిల్లీలో వెంకయ్యనాయుడు, విజయవాడలో చంద్రబాబు హైడ్రామాలను నడిపించారని అన్నారు.
హోదాపై తెలుగు ప్రజలకు కేంద్రం మూడు నామాలు పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం ఉదయం నుంచే ఢిల్లీలో కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, వెంకయ్యనాయుడు, బెజవాడలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటకు వచ్చి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలని డిమాండ్ చేశారు. పురంధేశ్వరి బీజేపీలో చేరి ప్రత్యేక హోదాకు వ్యతిరేకంగా మాట్లాడటం మంచిది కాదన్నారు. ఈనెల 10న తలపెట్టిన ఏపీ బంద్‌కు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నిర్వహించ తలపెట్టిన ఏపీ బంద్‌ను విజయవంతం చేయాలని నారాయణ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతోందని నారాయణతోనే కలసి మీడియా సమావేశంలో పాల్గొన్న సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏపీకి హోదాతో పాటు తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications