రెక్కీ... సినీ ఫక్కీలో నారాయణ రెడ్డి హత్య: గవర్నర్‌కు జగన్ ఫిర్యాదు!
హత్యకు గురైన నారాయణ రెడ్డి నిన్ననే ఆప్యాయంగా పలకరించారని, ఈ నెల 30వ తేదీన జరగనున్న వైసీపీ ప్లీనరీపై చర్చించారని, ఇవాళ ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
కర్నూలు: హత్యకు గురైన నారాయణ రెడ్డి నిన్ననే ఆప్యాయంగా పలకరించారని, ఈ నెల 30వ తేదీన జరగనున్న వైసీపీ ప్లీనరీపై చర్చించారని, ఇవాళ ఆయన హత్య వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని ఎంపీ బుట్టా రేణుక అన్నారు.
చదవండి: నారాయణ రెడ్డిని రక్షించేవాడ్ని: కేఈ, 'మంత్రులు, ఎమ్మెల్యేల కుట్ర'
నారాయణ రెడ్డి హత్యను ఆమె తీవ్రంగా ఖండించారు. రాజకీయ పార్టీల కదలికలపై పోలీసులకు సమాచారం ఉంటుందని, ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన బాధ్యత పోలీసులదే అన్నారు. చంద్రబాబు అండతోనే టిడిపి నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.

గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్న జగన్
నారాయణ రెడ్డి మృతి నేపథ్యంలో వైసిపి అధినేత జగన్ రేపు (సోమవారం) ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలవనున్నారు. ఆయన రేపు ఉదయం పది గంటలకు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండ నారాయణ రెడ్డి హత్య నేపథ్యంలో టిడిపి హత్యా రాజకీయాలు చేస్తోందని ఫిర్యాదు చేయనున్నారు. అనంతరం జగన్ కర్నూలు వెళ్తారు. నారాయణ రెడ్డి అంత్యక్రియలకు హాజరవుతారు. మరోవైపు, నారాయణ రెడ్డి మృతికి నిరసనగా రేపు కర్నూలు జిల్లా బందుకు వైసిపి పిలుపునిచ్చింది.

సినీ ఫక్కీలో హత్య
నారాయణ రెడ్డిని ప్రత్యర్థులు సినీ ఫక్కీలో హత్య చేశారు. ఎప్పటికప్పుడు ఆయన కదలికలను ముందుగానే పసిగట్టారు. తనకు ప్రాణాపాయం ఉందని గుర్తించి, ఆయన అప్రమత్తంగా ఉంటారు. నంద్యాలలో ఓ వివాహానికి హాజరయ్యారు.

రెక్కీ నిర్వహించి
విషయం ప్రత్యర్థులకు ముందే తెలిసి పక్కా ప్లాన్ వేశారు. ప్రత్యర్థుల్లో ఒకరు రెక్కీ నిర్వహించారని తెలుస్తోంది. ఆయన వచ్చే మార్గంలో స్పాట్ ఫిక్స్ చేసుకున్నారు. వెనుక నుంచి ట్రాక్టరుతో ఢీకొట్టించడం, ఎదరుగా ట్రాక్టర్లు పెట్టి వాహనాన్ని కదలకుండా చేయడం, ఆ వెంటనే బాంబులు విసరడం, వేట కొడవళ్లతో దాడి చేయడం అంతా సినీ ఫక్కీలో జరిగింది.

వారికిని వెళ్లిపోమని చెప్పి..
నారాయణ రెడ్డితో ఉన్న వారిని ప్రత్యర్థులు పారిపోమని చెప్పారని తెలుస్తోంది. అడ్డుకుంటే హత్య చేస్తామన్నారు. కేవలం ఆయననే టార్గెట్ చేసి ఈ అఘాయిత్యానికి తెగబడటం చూస్తుంటే ప్లాన్‌గా హత్య చేసినట్లుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications