Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ రిప్లై: స్థానికతపై స్పష్టత ఇస్తామని యనమల

విశాఖపట్నం/ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి భూముల సేకరణ విషయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ జవాబు ఇచ్చారు. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించవద్దని పవన్ కళ్యాణ్ చేసిన సూచనకు ఆయన పరోక్షంగా సానుకూలంగా ప్రతిస్పందించారు. రాజధాని ప్రాంతంలో భూముల రేట్లు భారీగా పెరిగాయని మంత్రి నారాయణ అన్నారు.

ఈ నెల 20 నుంచి రైతులను ఒప్పించి భూములు తీసుకుంటామని ఆయన తెలిపారు. బలవంతంగా ఏ రైతు నుంచి భూమి తీసుకోబోమని, రైతుల అంగీకారంతోనే భూములను తీసుకుంటామని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలు కావాలనే రాజధాని ప్రాంత రైతుల్లో భయాందోళనలను గురిచేస్తున్నాయని ఆరోపించారు. భూ సమీకరణను రాజకీయం చేయవద్దని మంత్రి నారాయణ సూచించారు.

ఇదిలావుంటే, రాష్ట్ర ఉద్యోగుల పిల్లల స్థానికతపై త్వరలో స్పష్టత ఇస్తామని, రాష్ట్ర విభజన తరువాత 371(డి) అవసరం లేదని ఏపీ ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అప్పటి అవసరాల కోసమే జోన్‌ విధానాన్ని రూపొందించారని, త్వరలో జోనల్‌ విధానం రద్దు చేసి కొత్త నిబంధనలు రూపొందిస్తామని ఆయన తెలిపారు.

Narayana replies to Pawan Kalyan on land acquisition

జవహర్‌రెడ్డి కమిటీ నివేదిక ప్రకారమే ఉద్యోగులను తరలిస్తామని యనమల అన్నారు. అమరావతి నుంచి పాలన వలన అర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. దానివల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆయన చెప్పారు.

విజయవాడ, గుంటూరు, నూజివీడులో ప్రభుత్వ ఆఫీస్‌లకోసం 6 లక్షల 72 వేల చదరపు అడుగుల స్థలం గుర్తించామని మంత్రి తెలిపారు. మంత్రులు, అధికారుల నివాసాల కోసం 252 అపార్ట్‌మెంట్లు, 31 విల్లాలు పరిశీలనలో ఉన్నాయని ఆయన చెప్పారు.

స్థానిక పరిస్థితులను బట్టే ప్రైవేట్‌ భవనాల అద్దెలపై నిర్ణయం తీసుకుంటామని యనమల తెలిపారు. వీలైనంత త్వరలోనే ఏపీ నుంచి పూర్తి స్థాయి పాలన ఉంటుందని ఆయన దీమా వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+