షిండే నవ్వి ఊరుకున్నారు: సిఎం తీరుపై నారాయణ

కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని, కానీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం సమైక్యాంధ్ర అంటున్నారని, ఈ విషయంపై తాను షిండేను ప్రశ్నించానని ఆయన వివరించారు. షిండే ఏమీ మాట్లాడుకుండా నవ్వి ఊరుకున్నారని ఆయన అన్నారు. దీన్ని బట్టి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు అధిష్టానం ఆడుతున్న ఆటలో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి ఆడుతున్నారని అర్థమవుతోందని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా తమ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఇదిలావుంటే, పార్టీ జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన బిజెపి నాయకులు భేటీ అయ్యారు. సీమాంధ్రపై రూపొందించిన నివేదికను తాము రాజ్‌నాథ్ సింగ్‌కు అందించినట్లు వారు తెలిపారు. కె. హరిబాబు, ఎడ్లపాటి రఘునాథ బాబు, సోమూ వీర్రాజు, శ్రీనివాస రాజు, సురేష్ రెడ్డి, నర్సింహా రెడ్డి, శాంతారెడ్డి రాజ్‌నాథ్‌ను కలిసినవారిలో ఉన్నారు.
పోలవరం ప్రాజెక్టును యధాతథంగా నిర్మించాలని, ఆ ప్రాజెక్టు స్థలమంతా సీమాంధ్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం అక్కడి ఆదాయంలో కొంత సీమాంధ్రకు ఇవ్వాలి లేదా అప్పుల పంపకంలో సీమాంధ్రకు కొన్ని తగ్గించాలని వారు తమ నివేదికలో సూచించారు.












Click it and Unblock the Notifications