అందంగా, విదేశీయులొచ్చేలా రాజధాని: నారాయణ
హైదరాబాద్: మూడేళ్లలో అందమైన రాజధాని నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మంగళవారం అన్నారు. గుంటూరు జిల్లా దొండపాడులో రైతుల నుండి ఆయన సమ్మతి పత్రాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. విదేశీయులు వచ్చి చూసేలా రాజధాని ఉంటుందన్నారు.
తాత్కాలిక రాజధాని నిర్మాణానికి మూడు రోజుల్లో స్థలం ఎంపిక పూర్తి చేస్తామని వెల్లడించారు. ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక రాజధాని ఉంటుందన్నారు. భూసమీకరణను వివాదం చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు.

అడవుల్లో రాజధాని పెట్టలేదనే వైసీపీ దుష్ప్రచారం: తాడికొండ ఎమ్మెల్యే
నవ్యాంధ్ర రాజధానిని అడవుల్లో పెట్టలేదనే విపక్షనేత జగన్ భూ సమీకరణపై దుష్ప్రచారం చేస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆరోపించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే ఇటీవల రాజధాని ప్రాంతంలో పంటలను తగులబెట్టిన వారిని రక్షించాలనే ఉద్దేశంతోనే జగన్ భూ సమీకరణపై ఇంతగా హడావిడి చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications