విశాఖపట్నంలో తొలిసారిగా - ప్రధాని మోదీ శుభాకాంక్షలు
విశాఖపట్నం: ఇవ్వాళ నేవీ డే. భారత నౌకాదళ దినోత్సవ వేడుకలను త్రివిధ దళాలు ఘనంగా జరుపుకొంటోన్నాయి. సాగర నగరం విశాఖపట్నంలో దీనికి సంబంధించిన వేడుకలు ఏర్పాటయ్యాయి. నౌకాదళ వేడుకలు దేశ రాజధానిలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. స్వాతంత్య్రం సిద్ధించినప్పటి నుంచీ ఢిల్లీలోనే జరుగుతూ వచ్చాయి నేవీ డే సెలబ్రేషన్స్. ఇప్పుడు మాత్రం ఈ ప్రతిష్ఠాత్మక వేడుకలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని ఎంపిక చేసింది.
దేశం దాటిన నేవీ డే సెలబ్రేషన్స్..
తొలిసారిగా దేశ రాజధానిని దాటాయి ఈ ఉత్సవాలు. తూర్పు నౌకాదళానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖపట్నంలో దీన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి హాజరు కానున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కేంద్రం- ఈ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించింది.

దేశం దాటిన నేవీ డే సెలబ్రేషన్స్..
తొలిసారిగా దేశ రాజధానిని దాటాయి ఈ ఉత్సవాలు. తూర్పు నౌకాదళానికి ప్రధాన కేంద్రంగా ఉన్న విశాఖపట్నంలో దీన్ని నిర్వహిస్తోంది. ఈ ఉత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించనున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనికి హాజరు కానున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా కేంద్రం- ఈ వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించాలని నిర్ణయించింది.
రాష్ట్రానికి వచ్చిన ద్రౌపది ముర్ము..
ఈ వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ఉదయం రాష్ట్రానికి వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ఆమె గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పౌర సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖకు
ఈ సభ అనంతరం రాష్ట్రపతి మధ్యాహ్నం 3:45 నిమిషాలకు విశాఖ చేరుకుంటారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో నౌకాదళ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అక్కడి నుంచే పలు ప్రాజెక్టులను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. కర్నూలులో డీఆర్డీవో నిర్మించిన నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్ ప్రాజెక్ట్, ముదిగుబ్బ-పుట్టపర్తి రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. రాత్రి 8 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి తిరుమల వెళ్తారు.
మోదీ విషెస్..
నౌకాదళ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నౌకాదళ అధికారులు ఉద్యోగులు, ఇతర సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు ఆయన గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారాయన. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తమ విషెస్ తెలిపారు. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నామని గుర్తు చేశారు.

ఆపత్కాలంలో..
భారత నౌకాదళం మన దేశానికి రక్షణ కవచంగా నిలిచిందని వారు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, సవాళ్లు ఎదురైన సమయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించారని నౌకాదళాధికారులను ప్రశంసించారు. అటు దేశ రక్షణలో భాగస్వామ్యులు కావడం మాత్రమే కాకుండా ఆపద సమయంలో ప్రాణాలొడ్డి పౌరులను కాపాడుతున్నాని చెప్పారు. నౌకాదళ అధికారులు, సిబ్బందికి సెల్యూట్ చేస్తున్నామని అన్నారు.












Click it and Unblock the Notifications