వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో కయ్యానికి సిద్ధం!: నాయిని, తెరపైకి రాజీనామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nayini opposes governor rule in Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులో గవర్నర్‌కు అధికారాలు ఇస్తే తాము కేంద్రం పైన ఉద్యమం చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహా రెడ్డి మంగళవారం చెప్పారు. గవర్నరుకు ప్రత్యేక అధికారాలపై కేంద్రంతో కయ్యానికైనా సిద్ధమన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అధికారాలను ఎవరూ బలవంతంగా తీసుకోలేరన్నారు.

తమ అధికారాలు ఎవరూ బలవంతంగా లాక్కోలేరన్నారు. కేంద్రం వెనక్కి తగ్గకుంటే ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని హెచ్చరించారు. అవసరమైతే తెలంగాణ ఎంపీలు రాజీనామాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. ఈ నెల 18న రాజ్‌‌నాథ్ సింగ్‌తో టీఆర్ఎస్ ఎంపీలు భేటీ అవుతారన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెరాస ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి సెంటిమెంట్ రాజేశారనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే.

పెట్టుబడులకు అవకాశమున్న నగరం: కేటీఆర్

సాఫ్టువేర్, హార్డ్‌వేర్ రంగాలలో హైదరాబాదు నగరాన్ని మోస్ట్ ఎఫిషియెంట్ సిటీగా మారుస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. సాఫ్టువేర్ సంస్థ పర్వేషియా ఇండియా ప్రయివేటు లిమిటెడ్ నూతన విస్తరణ విభాగాన్ని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.

హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అవకాశమున్న నగరమన్నారు. నగరంలో సాఫ్టువేర్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయన్నారు. నగరాన్ని గ్లోబల్ సిటీగా మారుస్తామన్నారు. ఐటీ అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున అన్ని సహకారాలు అందిస్తామన్నారు.

పోలీస్ లోగో ఆవిష్కరణ

తెలంగాణ పోలీసుల కోసం రూపొందించిన కొత్త లోగో మంగళవారం విడుదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హైదరాబాదు సచివాలయంలో ఈ లోగోను ఆవిష్కరించారు.

తెలంగాణ ప్రభుత్వానికి డెడ్‌లైన్

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకమైనా, ఫాస్ట్ పథకమైనా.. ఏదైనా ఫరవాలేదని, కానీ అడ్మిషన్ రోజునే ఫీజులు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల ప్రతినిధి రమేష్ వేరుగా తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారు. ఆగస్టు 31లోపు పాత బకాయిలన్నీ చెల్లించాలని డెడ్‌లైన్ విధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో పథకమేదైనా పాత విధానాలే ఉండాలన్నారు.

ఫాస్ట్ కమిటీ సంధిస్తున్న ప్రశ్నలపై ఆయన ఘాటుగా స్పందించారు. కాలేజీలు వ్యాపారం కోసం పెట్టుకున్నారా? అని ఫాస్ట్ కమిటీ అడుగుతోందని తాము ప్రభుత్వ చేయూతతో కళాశాలలు ఏర్పాటు చేయలేదన్నారు. తమ డబ్బుతోనే జేఎన్టీయూ, ఎంసెట్ ఆఫీసులు నడుస్తున్నాయన్నారు. ర్యాంకులు కూడా ప్రైవేటు కళాశాలలకే వస్తాయన్న విషయాలను విస్మరించరాదన్నారు.

English summary
Telangana Rastra Minister Nayini Narasimha Reddy opposed governor rule in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X