రాజ్యసభకు నాగబాబు ఎంపికలో ఢిల్లీ ట్విస్ట్ - ఆ ముగ్గురు ఖరారు..!!
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ఖాళీ అయిన మూడు స్థానాలకు కూట మి నుంచి అభ్యర్ధుల ఎంపిక పైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. వైసీపీ నుంచి ఖాళీ చేసిన ముగ్గురు అభ్యర్ధుల స్థానాల భర్తీకి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజీనామా చేసిన ముగ్గురూ బీసీ వర్గానికి చెందిన వారు కావటంతో కూటమి నేతలు ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. తొలుత నాగబాబు రాజ్యసభ ఖాయమని భావించినా.. ఢిల్లీ జోక్యంతో ఏపీ నుంచి ఎంపికయ్యే సభ్యుల విషయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వచ్చాయి.
ముగ్గురి ఎంపిక
ఏపీ నుంచి ముగ్గురు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేయటంతో ఈ మూడు స్థానాలు దక్కేదెవరికనే చర్చ మొదలైంది. తొలి నుంచి కూటమిలో ఉన్న మూడు పార్టీలకు మూడు స్థానాలు పంచుకుంటాయని అంచనాలు ఉన్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. గత ఎన్నికల్లో నాగబాబు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తొలుత భావించినా.. బీజేపీ అభ్యర్ధనతో ఆ సీటు సీఎం రమేశ్ కు కేటాయించారు. దీంతో, నాగబాబుకు రాజ్యసభ ఖాయమని భావించారు. అయితే, ఇప్పుడు కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

టీడీపీ జనసేన నుంచి
ప్రస్తుతం భర్తీ చేయాల్సిన మూడు స్థానాల్లో బీదా మస్తాన రావుకు తిరిగి టీడీపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయటం ఖాయమైంది. ఆ హామీతోనే మస్తాన రావు వైసీపీకి రాజీనామా చేసారు. మూడు స్థానాల్లో బీసీలకు ఇవ్వకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందని కూటమి నేతలు భావిస్తున్నారు. దీంతో, బీదాకు ఖాయమని చెబుతున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. అందులో మాజీ ఎంపీ గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జయదేవ్ అభ్యర్దిత్వం పైన పవన్ సైతం అంగీకారం తెలిపారని సమాచారం. ఇదే స్థానాన్ని కంభంపాటి రామ్మోహన్ సైతం ఆశిస్తున్నారు. అదే విధంగా సానా సతీశ్ పేరు ప్రముఖంగా రేసులోకి వచ్చింది. అటు టీడీపీ, జనసేన ముఖ్య నేతల నుంచి సానా సతీశ్ కు మద్దతు లభిస్తోంది.

బీజేపీ తాజా ప్రతిపాదన
దీంతీ, నాగబాబు లేదా సానా సతీశ్ లో ఒకరు జనసేన కోటాలో ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. సానా సతీశ్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ ముఖ్యుల నుంచి కీలక వర్తమానం అందినట్లు సమాచారం. బీజేపీ నుంచి తొలుత మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది. అయితే, ఢిల్లీ నేతలు తాజాగా కేంద్ర మంత్రివర్గం లోని ఒక నేత పేరు సూచించినట్లు సమాచారం. రాజ్యసభ కాలపరిమితి ముగియనున్న ఆ మంత్రి కి ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు, పవన్ సైతం ఆమోదం తెలిపారు. దీంతో, టీడీపీ నుంచి గల్లా జయదేవ్ లేదా కంభంపాటి రామ్మోహన్ లో ఒకరికి.. అదే విధంగా జనసేన నుంచి సానా సతీశ్..చివరి నిమిషంలో సమీకరణాలు మారితే నాగబాబు పేర్లు ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications