అమరావతికి భారీ వాటర్ బ్యాంక్‌ నీరుకొండ రిజర్వాయర్ పనులపై తాజా కబురు!

అమరావతి రాజధాని నగరానికి నీటి భద్రత కల్పించేందుకు నిర్మిస్తున్న నీరుకొండ రిజర్వాయర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. 440 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భారీ జలాశయం పనులు దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. ఇది రాజధాని అవసరాలకు వాటర్ బ్యాంక్‌గా, వరద నీటిని నిల్వ చేసుకునే కేంద్రంగా, భవిష్యత్తులో పర్యాటక ఆకర్షణగా రూపుదిద్దుకుంటోంది.

నీరుకొండ రిజర్వాయర్‌లో సుమారు 0.4 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. గతంలో కొండవీటివాగు, కొటేళ్లవాగు వంటి ప్రవాహాల ద్వారా వచ్చిన వరద నీరు నేరుగా ఉండవల్లి వద్ద ప్రకాశం బ్యారేజీలో కలిసేది. ఇప్పుడు ఆ నీటిని రాజధాని అవసరాలకు ఉపయోగపడేలా ఇక్కడ నిల్వ చేస్తున్నారు. ఇటీవల మురసు తుపాను సమయంలో వచ్చిన వరద జలాలను కూడా ఈ రిజర్వాయర్‌లో నింపారు.

Neerukonda Reservoir Amaravati Nears Completion Set to Become Major Water Hub for Amaravati

దీనివల్ల రాజధాని ప్రాంతంలో వరద ప్రమాదం తగ్గడమే కాకుండా, వేసవి కాలంలో నీటి అవసరాలు తీర్చుకునే అవకాశం ఏర్పడుతుంది.రిజర్వాయర్ చుట్టూ 158 ఎకరాల్లో ల్యాండ్‌స్కేప్, గ్రీనరీ అభివృద్ధి చేయనున్నారు. మట్టి కొట్టుకుపోకుండా కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. జలాశయం చుట్టూ బహుళ ప్రయోజన ఉద్యానవనాలు, వినోద సౌకర్యాలు కల్పించాలన్నది ప్రణాళిక. భవిష్యత్తులో దీన్ని పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేసి జలక్రీడలు, విహార కార్యక్రమాలకు అనువైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.

అమరావతిలో వరద నియంత్రణ, నీటి నిల్వ కోసం సమగ్ర జలవనరుల వ్యవస్థను రూపొందిస్తున్నారు. కొండవీటివాగు, పాలవాగు వంటి ప్రవాహాలను ఆధునికీకరిస్తూ, కొత్త కాలువలు నిర్మిస్తున్నారు. మొత్తం మూడు ప్రధాన కాలువలు, ఆరు జలాశయాలను అభివృద్ధి చేయాలన్నది లక్ష్యం. నీరుకొండ రిజర్వాయర్ ఈ వ్యవస్థలో అతిపెద్దది. దీనితో పాటు ఇతర రిజర్వాయర్లు కూడా రాజధాని నీటి అవసరాలు, వరద నియంత్రణలో కీలక పాత్ర పోషించనున్నాయి.

తెలంగాణ కష్టం మెచ్చిన కేంద్రం.. 1,087 కోట్ల నిధుల వరం!
తెలంగాణ కష్టం మెచ్చిన కేంద్రం.. 1,087 కోట్ల నిధుల వరం!

నీటి నిల్వ, వరద నియంత్రణతో పాటు పర్యావరణ సమతౌల్యం, భూగర్భ జలాల పునరుద్ధరణ, పచ్చదనం పెంపొందించడం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాల్లో భాగం. రాజధాని అమరావతిని నీలి-పచ్చ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నీరుకొండ రిజర్వాయర్ ముఖ్యమైన భాగంగా నిలుస్తోంది. పనులు పూర్తయ్యాక రాజధాని నివాసులకు, సందర్శకులకు ఇది ఒక ముఖ్యమైన ఆకర్షణగా మారే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+