ఇండియాలో మోస్ట్ డేంజరస్ ట్రైన్ రూట్... ఒక్కసారైనా జర్నీ చేయాల్సిందే!
భారతదేశంలో రైలు ప్రయాణం అంటే ఎన్నో అందమైన అనుభూతులను పంచుతుంది. పచ్చటి పొలాల గుండా, ప్రకృతి రమణీయ దృశ్యాలను కనువిందు చేసేలా చూపిస్తూ ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు రైలు ప్రయాణం అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. కిటికీ పక్కన కూర్చొని అందమైన దృశ్యాలను తిలకిస్తూ జీవితకాలానికి సరిపడా మధురమైన అనుభూతులను ఇంటికి తీసుకువెళతారు. ఎన్నో అద్బుతాలకు నియలమైన భారతీయ రైల్వేలో అత్యంత ప్రమాదకరమైన మోస్ట్ డేంజరస్ రైలు ప్రయాణం కూడా ఉంది.
ప్రయాణికులు నిలబడకూడదు
అత్యంత ప్రమాదకరమైన ఈ రైల్ లైన్ "ది మాథెరన్ హిల్ రైల్వేస్" మహారాష్ట్రలో ఉంది. నెరల్ నుంచి మాథేరన్ వరకు కొంత సమయానికే ప్రయాణిస్తుంది. 20 కిలోమీటర్ల ఈ రైలు మార్గంలో అనేక ప్రమాదకరమైన మలుపులు ఉంటాయి. పశ్చిమ కనుమలకు చెందిన కొండగుండా ఈ రైలు మాథెరన్ హిల్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణాన్ని అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో డ్రోన్ తో వీడియో తీశారు.

ఈ మార్గంలో ప్రయాణించే సమయంలో రైల్వే ఒక నిబంధనను విధించింది. రైలు కదిలే సమయంలో ప్రయాణికులు నిలబడకూడదు. ఎందుకంటే కోచ్ ల గురుత్వాకర్షణ శక్తిని మారుస్తుందని, తద్వారా ప్రయాణికులు ప్రమాదానికి గురవుతారని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిషేధిస్తారు.

ఒక్కసారైనా ప్రయాణించాలి
ఈ రైలు మార్గంలో జీవితకాలంలో ఒకసారైనా ప్రయాణించాలి. అత్యంత ప్రమాదకర మలుపులు తిరుగుతూ ప్రయాణికులను తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తుంది. రోజూ ప్రయాణం చేసేవారికి అలవాటైనప్పటికీ పర్యాటకులు ఈ రైలు ఎక్కడానికి ప్రతి ఏడాది భారీ సంఖ్యలో వస్తుంటారు. కొత్తగా వచ్చేవారికి మాత్రం ఈ ప్రయాణం చాలా భయాన్ని కలిగిస్తుంది. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా నారెల్-మాథెరన్ రైలు ప్రయాణం చేయండి. జీవితకాలానికి సరిపడా అనుభూతిని సొంతం చేసుకోండి.












Click it and Unblock the Notifications