బాబుకు నెదర్లాండ్ అంబాసిడర్ ప్రశంస, 'ఇకనైనా జగన్‌కు కనువిప్పు కలగాలి'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన నెదర్లాండ్ రాయబారి అల్ఫెన్స్ స్టోలింగ్ గురువారం ప్రశంసలు కురిపించారు. ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా మలిచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారన్నారు.
విజయవాడలో చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు డచ్ కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.

అమరావతి నిర్మాణానికి విరాళాల వెల్లువ
రాజధాని అమరావతి నిర్మాణానికి వివిధ వర్గాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి నేటి వరకు రూ.41.71 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులను రెవెన్యూ శాఖ సీఆర్డీఏ ఖాతాకు బదిలీ చేసింది.
పరీక్షల నిర్వహణలో సంస్కరణల అమలుకు విద్యాశాఖ సిద్ధం
ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు పరీక్షల విధానంలో సంస్కరణలు అమలు చేయాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ సంస్కరణలను అమలు చేయనుంది. పదో తరగతిలో మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సంస్కరణలు అమలు కానున్నాయి.
జగన్‌కు కనువిప్పు కలగాలి: దేవినేని
2018 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తుంటే విపక్షాలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. పట్టిసీమ నీటిని చూసైనా జగన్‌కు కనువిప్పు కలగాలన్నారు. దేవినేని జక్కంపూడిలో పోలవరం కుడికాలువ పనులు పరిశీలించారు.












Click it and Unblock the Notifications