Coolie: రజనీ సాయం మర్చిపోలేం..! కూలీ మూవీకి లోకేష్ స్పెషల్ విషెస్..!
తమిళ సూపర్ స్టార్, పాన్ ఇండియా నటుడు రజనీకాంత్ కూలీ చిత్రం ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అక్కినేని నాగార్జున విలన్ గా, అమీర్ ఖాన్ స్పెషల్ అప్పీయరిన్స్ తో వస్తున్న ఈ చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి.
భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం విడుదల సందర్భంగా చిత్ర పరిశ్రమల్లోని రజనీ తోటి నటీనటులతో పాటు రాజకీయ నేతలు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ఆయనకు విషెస్ తెలిపారు.
రజనీకాంత్ కూ ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబానికీ మధ్య ఎన్నో ఏళ్లుగా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అప్పుడెప్పుడో చంద్రబాబు ఎన్డీయేలో చక్రం తిప్పుతున్న రోజుల్లో సైతం ఆయనకు రజనీ అండగా నిలిచారు. చంద్రబాబు సీఎంగా ఉండగా పలుమార్లు ఆయనను రజనీ కుటుంబంతో సహా వచ్చి కలిసేవారు. ఏపీలో గత ఎన్నికలకు ముందు చంద్రబాబును జైల్లో వేసినప్పుడు సైతం రజనీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇదే విషయాన్ని గుర్తుచేసుకుంటూ చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ఇవాళ ట్వీట్ చేశారు.

As @rajinikanth sir completes 50 years in films, we audiences are just lucky to live in the Rajni-era! I will never forget his unwavering support to our family in our darkest hour. Wishing Team #Coolie great success. pic.twitter.com/FCIkgVWfyY
— Lokesh Nara (@naralokesh) August 9, 2025
సార్.. సినిమాల్లో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, మేము ప్రేక్షకులుగా రజనీ యుగంలో జీవించడం అదృష్టమంటూ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కష్ట సమయంలో తమ కుటుంబానికి మీరు ఇచ్చిన అచంచల మద్దతును తాను ఎప్పటికీ మర్చిపోలేనని లోకేష్ తెలిపారు. అంతే కాదు కూలీ చిత్ర యూనిట్ కు గొప్ప విజయం లభించాలని కోరుకుంటున్నట్లు లోకేష్ ట్వీట్ లో వెల్లడించారు. దీంతో పాటు రజనీ 50 ఏళ్ల ప్రస్ధానంపై రూపొందించిన ఓ ఏవీని కూడా ఈ ట్వీట్ కు లోకేష్ జత చేశారు.












Click it and Unblock the Notifications