బాబు అంచనాకు రివర్స్!: అమరావతి నిర్మాణ ఖర్చు రూ.27వేల కోట్లు
న్యూఢిల్లీ: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.27,097 కోట్లు ఖర్చు అవుతుందని నిపుణుల కమిటీ అంచనా వేసింది. రాజధాని నిర్మాణం పైన నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్రమంత్రి హరిభాయ్ పరతిభాయ్ చౌదరి లోకసభలో మంగళవారం నాడు ప్రకటించారు.
భవనాల నిర్మాణానికి రూ.10,519 కోట్లు, రాజధాని ప్రాంత నిర్మాణం కోసం రూ.1,536, మౌలిక వసతుల కోసం రూ.5,861 కోట్లు, మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరణ కోసం రూ.9,181 కోట్ల ఖర్చు అవుతుందని చెప్పారు. 2015-15, 2015-16లో ఏపీకి రూ.1,850 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రమంత్రి చౌదరి చెప్పారు. కాగా, అమరావతి నిర్మాణాని లక్షల కోట్లు కావాలని చంద్రబాబు చెబుతున్న విషయం తెలిసిందే.

పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ వైఖరి సరికాదు: వెంకయ్య
పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్న వైఖరి సరికాదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. పార్లమెంటు ఆవరణలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడారు. సోనియా, రాహుల్ గాంధీలకున్యాయస్థానంలో చుక్కెదురైతే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నారు.
తప్పు చేసినవారు భయపడాలి గానీ, తప్పు చేయని వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఓ వ్యక్తి సోనియా, రాహుల్‌పై న్యాయస్థానంలో పిటిషన్ వేస్తే దానికి సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసిందని, దీనిపై వారు న్యాయస్థానంలో పోరాడాలి గానీ ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications
