పవన్ కళ్యాణ్ బస్సుయాత్రకు కొత్త కాన్వాయ్; జనసేనాని రథాలు సిద్ధం.. సోషల్ మీడియాలో వైరల్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్త పర్యటనకు సన్నాహాలు ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ దసరా నుండి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పటి నుండే కొనసాగుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు కొత్త కాన్వాయ్

ఇప్పటికే టీడీపీ, వైసీపీ ప్రజల్లోకి వెళ్తూ రాజకీయాలను వేడెక్కిస్తుంటే, ఇప్పుడు ఆ కోవలోకి జనసేన కూడా చేరింది. అందులో భాగంగా దసరా పండుగను పురస్కరించుకుని విజయదశమి నాడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అక్టోబర్ 5వ తేదీన విజయదశమి సందర్భంగా పవన్ కళ్యాణ్ తిరుపతిలో బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సంబంధించి కొత్త కాన్వాయ్ సిద్ధమైంది.

8 స్కార్పియో వాహనాలను కొనుగోలు చేసిన జనసేన.. సోషల్ మీడియాలో వాహనాల ఫోటోలు వైరల్

జనసేనాని రధాలు సిద్ధం అయ్యాయని జనసేన శ్రేణులు చెప్తున్నారు. కొత్త కాన్వాయ్‌లో భాగంగా, ఇప్పటికే ఎనిమిది స్కార్పియో వాహనాలు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో బారులు తీరాయి. బ్లాక్ కలర్ మహీంద్రా స్కార్పియో వాహనాలను జనసేన పార్టీ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొత్త కాన్వాయ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు అనుగుణంగా కాన్వాయ్ వాహనాలలో ఇంటీరియర్ మార్పులు జరగనున్నాయి.

వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడటమే లక్ష్యం.. బస్సు యాత్రతో ప్రజల్లోకి పవన్

వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడటమే లక్ష్యం.. బస్సు యాత్రతో ప్రజల్లోకి పవన్

2023 మార్చిలోనే ఎన్నికలు జరుగుతాయని.. ఈ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలని జనసేన భావిస్తున్న క్రమంలోనే పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్టు సమాచారం .వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 175 సీట్లు వచ్చేలా వైసిపి ఎమ్మెల్యేలు, కీలక నేతలు కష్టపడాలని ఓ పక్క ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తే, రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలతో ప్రతి జిల్లాలోనూ బహిరంగ సభలతో వచ్చే ఎన్నికలలో వైసీపీ ని ఓడించి తీరాలని పవన్ కళ్యాణ్ శతవిధాల ప్రయత్నం చేయనున్నారు. ఈ మేరకు ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా చూడటమే తమ కర్తవ్యం అని చెప్పిన పవన్ ఆ పనిలో దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+