ఇంద్రకీలాద్రికి కొత్త రూపు, మాస్టర్ ప్లాన్ అమలు - భక్తులకు ఇక నుంచి..!!
ఇంద్రకీలాద్రికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. భక్తులకు సౌకర్యాల పెంపుతో పాటుగా వసతి కల్పించే దిశగా భారీ స్థాయిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ దిశగా మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. మూడు దశల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయనున్నారు. మరో ఏడాది కాలంలో ఆలయ రూపు రేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. భక్తులకు ఇక నుంచి దర్శనం తో పాటుగా సేవలను సులభతరం కానున్నాయి.
విజయవాడ కనకదుర్గ ఆలయం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేస్తున్నారు. అన్నదాన సత్రం, ప్రసాదం తయారీ భవనం సహా అనేక నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రముఖ బంగారు నగల సంస్థ కీర్తిలాల్ జ్యూయలరీ యాజమాన్యం రూ.2 కోట్ల విలువైన వజ్రా భరణాలను అమ్మవారికి సమర్పించింది. దుర్గగుడి అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.27 కోట్లుతో ప్రసాదం పోటు భవనం నిర్మిస్తున్నారు. దీని నాలుగు (జి+4) అంతస్తులుగా నిర్మిస్తున్నారు. ఈ భవనం పనులు 60 శాతం పూర్తి అయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ప్రసాదం తయారుచేసే వంటశాల ఉంటుంది. ఇక..మొదటి, రెండో అంతస్తులు ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మూడు, నాలుగో అంతస్తులో ప్రసాదం ప్యాకేజీ, స్టోరేజీల నిర్మాణాలు జరుగుతున్నాయి.

అదే విధంగా మల్లేశ్వరాలయానికి వెళ్లే దారిలో పూజా మండపం నిర్మాణం చేపడుతున్నారు. దీనికి రూ.7 కోట్లు వ్యయం ఖర్చు చేస్తున్నారు. పూజా మండపం ఒకటి(జి+1)అంతస్తులుగా నిర్మాణం చేస్తున్నారు. గ్రౌండ్, మొదటి అంతస్తు కెపాసిటీ ఒకేసారి 800 మందికి ఉండే విధంగా నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 70% పనులు పూర్తి చేశారు. నటరాజస్వామి ఆలయం దగ్గర రాతి యాగ శాల నిర్మాణం చేపడుతున్నారు. దీన్ని దాత ఎస్.నరసింహారావు రూ.5 కోట్లు వ్యయంతో నిర్మిస్తున్నారు. ఆలయంలో అధునాతన అన్నదాన సత్రం ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని రూ.30 కోట్లు వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. అంతస్తులు ఒకటి (జి+1) అన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో 1,400 మంది ఒకేసారి కూర్చుని తినేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ ను 8 మీటర్ల వెడల్పు, 280 మీటర్ల పొడవు విస్తీర్ణంతో నిర్మిస్తున్నారు. మొత్తం 7 క్యూలైన్లు ఉండనున్నాయి. ఒకేసారి 2,800 మంది భక్తులు ఈ క్యూ లైన్ లో వెళ్లే విధంగా తీర్చి దిద్దుతున్నారు.












Click it and Unblock the Notifications