రేవంత్‌రెడ్డిని కాదని చంద్రబాబుకు అనుకూలంగా ప్రాజెక్టు ఓకే చేసిన మోడీ

కేంద్రంలో, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటంతో రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితమైన ప్రాజెక్టులన్నీ పట్టాలెక్కడానికి వరుసకడుతున్నాయి. కేంద్రంలో ఎన్డీయే మనుగడకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు కీలకం కావడంతో ఇప్పటికే అనేక ప్రాజెక్టులను మంజూరు చేయడంతోపాటు నిధులను కూడా విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపించింది. 60 సంవత్సరాల నుంచి కేవలం ప్రతిపాదనలకే పరిమితమై కాగితాలపై ఉన్న కొవ్వూరు-భద్రాచలం రోడ్డు రైల్వే ప్రాజెక్టు ప్రారంభం కాబోతోంది.

భూసేకరణ జరపాలంటూ అధికారులకు ఆదేశాలు
ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జరపాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంవల్ల మెట్ట ప్రాంతాల్లోని ప్రజలకు రైలు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ రైలు మార్గాన్ని తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారికి అనుసంధానంగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతుంది. అయితే దీనికి కేంద్రం బదులివ్వలేదు. చింతలపూడి, టి.నరసాపురం మండలాలకు కొత్తగా రైలు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కొయ్యలగూడెం, జీలుగుమిల్లి, జంగారెడ్డి గూడెం మండలాలకు ఈ మార్గం చాలా దగ్గరగా ఉంటుంది.

new railway line is coming up between Kovvuru-Bhadrachalam Road with the approval of the union government

హైదరాబాద్-విశాఖ మధ్య 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది
ప్రతిపాదనల ప్రకారం ఈ ప్రాజెక్టు సత్తుపల్లి, దమ్మపేట, అశ్వారావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాలమీదుగా వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం కొత్త గూడెం నుంచి సత్తుపల్లి వరకు సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే కలిసి సంయుక్తంగా లైను నిర్మాణాన్ని పూర్తిచేస్తాయి. సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు బొగ్గు రవాణా అవుతోంది.

అశ్వారావుపేట, జీలుగుమిల్లి, జంగారెడ్డిగూడెంవైపు కాకుండా సత్తుపల్లి నుంచి చింతలపూడి, టి.నర్సాపూరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాలమీదుగా కొవ్వూరుకు వేయాలనే ప్రతిపాదనలు రైల్వేబోర్డుకు అందుతున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుపుకునే అవకాశం ఉంది. దీనివల్ల హైదరాబాద్- విశాఖపట్నం రైల్వే మార్గంలో 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+