కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తహసీల్దార్ హసీనాబీ కేసులో కొత్త ట్విస్ట్ .. ఓ ఎంపీడీవోతో కలిసి హసీనాబీ పరారీ

|
Google Oneindia TeluguNews

కర్నూలు జిల్లా గూడూరు తహసీల్దార్ హసీనాబీ కేసులో కొత్త ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. 4 లక్షల లంచం కేసులో ఏసీబీ కి పట్టుబడిన హసీనాబీ పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె కోసం ఏసీబీ అధికారులు గాలిస్తున్నారు. ఇలా గాలిస్తున్న క్రమంలోనే వారికి హసీనాబీ కి సంబంధించిన కొత్త విషయాలు తెలిశాయి.

 తహసిల్దార్ హసీనాబీతో పాటు కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య కూడా పరారీ

తహసిల్దార్ హసీనాబీతో పాటు కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య కూడా పరారీ

గూడూరు తహసిల్దార్ హసీనాబీ కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్యతో ఆమె సహజీవనం చేస్తున్నట్లు గుర్తించిన ఎసిబి అధికారులు ఇద్దరూ కలిసే పరారైనట్లు గా గుర్తించారు. రూ.4 లక్షల లంచం కేసులో ఏసీబీకి పట్టుబడ్డ హసీనాబీ కర్నూలులోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో సీ క్యాంప్‌లోని క్వార్టర్ నంబర్ 40లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఇక్కడ హసీనాబీ కు సంబంధించిన కీలక ఆధారాలు లభించాయని సమాచారం.

హసీనాబీ పట్టుబడిన రోజు నుండే గిడ్డయ్య మెడికల్ లీవ్

హసీనాబీ పట్టుబడిన రోజు నుండే గిడ్డయ్య మెడికల్ లీవ్

హసీనాబీ బినామీ ఏసీబీకి పట్టుబడిన నాటి హసీనాబీ తో పాటు కొత్తపల్లి ఎంపీడీవో గిడ్డయ్య కూడా అందుబాటులో లేరు. గిడ్డయ్య ఆరోజు నుండి మెడికల్ లీవ్ లో ఉండటం ఏసీబీ అధికారుల అనుమానాలకు బలాన్ని చేకూరుస్తుంది. ఏసీబీ అధికారులకు చిక్కిన పారిపోవడానికి ఆమెకు కొత్తపెళ్లి ఎంపీడీవో సహకరించారని అనుమానిస్తూనే ఎసిబి అధికారులు ఆయన పైన కూడా కేసు నమోదు చేసే పనిలో ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే కర్నూలులోని ఎంపీడీవో గిడ్డయ్య క్వార్టర్స్‌లో కూడా ఏసీబీ సోదాలు చేపడుతోంది.

బీ, సీ క్యాంపుల్లోని అద్దె గదులు తీసుకున్న హసీనాబీ

బీ, సీ క్యాంపుల్లోని అద్దె గదులు తీసుకున్న హసీనాబీ

తహసీల్దార్ హసీనాబీ ఆచూకీ కోసం గాలిస్తున్న ఏసీబీ అధికారులు ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేశారు. కర్నూలు బీ, సీ క్యాంపుల్లోని 7 హాస్టళ్లలో హసీనా రూములు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు అన్ని హాస్టళ్లకు ప్రతి నెల రూమ్ అద్దె కూడా చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే హసీనాబీ ఇన్ని హాస్టళ్లలో రూములు ఎందుకు తీసుకున్నారు అనేది మాత్రం మిస్టరీగానే ఉంది. మరోవైపు హసీనాబీకి ఎవరైనా ఆశ్రయం కల్పిస్తే.. వాళ్లపైనా కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.

బంధువుల ఇళ్ళలోనూ సోదాలు .. హసీనాబీతో పాటు గిడ్డయ్యపై కేసు

బంధువుల ఇళ్ళలోనూ సోదాలు .. హసీనాబీతో పాటు గిడ్డయ్యపై కేసు

హసీనాబీ బంధువుల ఇళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఆమె ఇంటికి వస్తే కచ్చితంగా సమాచారం ఇవ్వాలని చెప్పారు.భూసమస్య పరిష్కారం కోసం సురేష్ అనే వ్యక్తి నుండి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో సురేష్ అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించి హసీనాబీ బాగోతాన్ని బయట పెట్టాడు. ఆన్‌లైన్‌లో భూమి క్లియరెన్స్‌ కోసం సురేష్ ను రూ. 8 లక్షలు డిమాండ్‌ చేశారు తహసిల్దార్ హసీనాబీ . ప్లాన్ ప్రకారం రైతు తహసీల్దార్ బినామీ అయిన భాషాకు డబ్బులు ఇస్తుండగా రైతు నుంచి రూ.4 లక్షలు తీసుకుంటున్న క్రమంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు ఏసీబీ ఆధికారులు .ఇక అప్పటి నుండి పరారీలో ఉన్న ఆమె కేసులో ఇప్పుడు ఎంపీడీవో గిడ్డయ్య కూడా ఓ పాత్రధారిగా ఉండటంతో ఇప్పుడు ఇద్దరి కోసం వేట ముమ్మరం చేశారు .

English summary
ACB officials have identified the Gudur Tehsildar Hasinabi MPDO Giddayya absconded together. The ACB officials inspected the government quarters of Hasinabi at Kurnool, officials got key information about Hasinabi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X