వివేకా హత్య కేసులో భారీ ట్విస్ట్- సీబీఐ కీలక ప్రకటన: కీలక వ్యక్తుల విచారణలో..!!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో భారీ ట్విస్టు చోటు చేసుకుంది. ఇప్పటికే సీబీఐ సాగించిన సుదీర్ఘ విచారణతో ఒక నిందుతులను గుర్తించినట్లేనని అందరూ భావించారు. హత్య జరిగిన ప్రాంతం నుంచి అనేక మంది అనుమానితులను సీబీఐ విచారించింది. వివేకా కుమార్తె సునీత ఇచ్చిన ఫిర్యాద-అనుమానితుల జాబితా ఆధారంగా సీబీఐ విచారణ సాగించింది. తాము గమనించిన అనేక అంశాల్లోనూ లోతుగా సమాచారం సేకరించింది. హత్య జరిగిన వివేకా నివాసంలో ఆధారాలను సేకరించింది.

Recommended Video

    వైఎస్ షర్మిల పార్టీ ప్రకటన ఆ రోజే.. కీలక సన్నివేశాలకు వేదిక కానున్న ఇడుపులపాయ!! || Oneindia Telugu
    సీబీఐ సుదీర్ఘ విచారణ..

    సీబీఐ సుదీర్ఘ విచారణ..

    ఆ తరువాత ఆయన వద్ద పని చేసే సిబ్బందితో మొదలైన విచారణ తాజాగా.. వైఎస్ కుటుంబ సభ్యుల దాకా కొనసాగింది. ఇక, కొద్ది రోజుల క్రితం సునీల్ యాదవ్ అనే వ్యక్తిని గోవాలో అదుపులోకి తీసుకున్న సీబీఐ ఆయన్ను కోర్టు అనుమతితో విచారణ కోసం అదుపులోకి తీసుకుంది. ఆ సమయంలో పులివెందుల లో ఒక కాలువలో వివేకా హత్యకు సంబంధిచి ఉపయోగించిన ఆయుధాల కోసం అన్వేషించారు. కానీ, అక్కడ ఫలితం రాలేదు. అయితే, సీబీఐ అనుమానిస్తున్న వారి నివాసాల్లోనే హత్యా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రచారం సాగింది.

    కీలక దశకు వచ్చినట్లేనని..

    కీలక దశకు వచ్చినట్లేనని..

    సునీల్ యాదవ్ నివాసంలో ఆర్దిక లావాదేవీలకు సంబంధించిన వివరాలతో పాటుగా.. బ్యాంకు పుస్తకాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఇక, తాజాగా ఎంపీ అవినాశ్ రెడ్డి వ్యక్తిగత సిబ్బందిని విచారించిన సీబీఐ..ఆ తరువాత పులివెందుల లో వైసీపీ నేత దేవిరెడ్డి శంకరరెడ్డిని విచారించింది. ఇక, వరుసగా రెండు రోజుల పాటు అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర రెడ్డి, ప్రతాప రెడ్డిలను సీబీఐ విచారించింది. వారి నుంచి పూర్తి సమాచారం సేకరించింది. ఈ సమయంలో..సీబీఐ వివేకా హత్య కేసు ఒక కొలిక్కి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అయింది.

    సీబీఐ ప్రకటనతో మళ్లీ మొదటికేనా..

    సీబీఐ ప్రకటనతో మళ్లీ మొదటికేనా..

    త్వరలోనే అసలు నిందితులు ఎవరో బయటకు వస్తారనే ప్రచారమూ సాగింది. ఈ సమయంలో సీబీఐ ఇచ్చిన ఒక పత్రికా ప్రకటన కొత్త ట్విస్టుగా మారిపోయింది. సీబీఐ ఆ ప్రకటనలో 2019 మార్చి 14-15 అర్ద్రరాత్రి సమయంలో ఆయన నివాసంలోనే దారుణంగా హత్యకు గురయ్యారని..దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు జూలై 9, 2020 నుంచి సీబీఐ ఈ కేసు విచారణ ప్రారంభించిందని వివరించారు. ఈ కేసుకు సంబంధించి నమ్మకమైన సమాచారం అందించిన వారికి రూ 5 లక్షలు నజరానాగా అందిస్తామంటూ సీబీఐ ప్రకటనలో పేర్కొంది. హత్య నిందితుల ఆచూకీ కోసం ఈ ప్రకటన జారీ చేసింది.

    సమాచారం ఇస్తే రివార్డు..

    సమాచారం ఇస్తే రివార్డు..

    సమాచారం తెలిసిన వారు ప్రకటనలో పేర్కొన్న అధికారులకు..వారికి ఫోన్ల ద్వారా..లేకుంటే స్వయంగా కార్యాలయంలో తెలియచేయవచ్చని పేర్కొంది. తెలియచేసిన వారి పేర్లు రహస్యంగా ఉంటాయని స్పష్టం చేసింది. అయితే, అసలు కేసు విచారణ పూర్తయింది...వ్యవహారం కొలిక్కి వచ్చిందని భావిస్తున్న వేళ ఇచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు కీలకంగా మారింది. సాధారణ ప్రజల నుంచి ఈ సమాచారం సీబీఐ కోరటం ద్వారా.. అసలు ఈ విచారణలో ఇప్పటి వరకు సీబీఐ ఏం తేల్చిందనే చర్చ మొదలైంది.

    రాజకీయంగా మరో సారి ఇలా..

    రాజకీయంగా మరో సారి ఇలా..

    ఈ ప్రకటన ఇప్పుడు రాజకీయంగానూ చర్చకు కారణమైంది. వివేకా హత్య కేసుకు సంబంధించి రాజకీయంగానూ పలు ఆరోపణలు - విమర్శలకు కారణమైంది. అయితే, తాజా సీబీఐ పత్రికా ప్రకటనతో మొత్తం వ్యవహారం మరో మలుపు తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. దీని పై సీబీఐ మరింత స్పష్టత ఇచ్చ అవకాశం కనిపిస్తోంది. ఇప్పడు ఈ వ్యవహారం పైన రాజకీయంగా చర్చకు దారి తీయనుంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+