కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారాల పట్టిల్లో దగ్గుబాటి పురందేశ్వరి. 2004 ఎన్నికల వరకు ఆమె సాధారణ గృహిణి. అనివార్య పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి అనూహ్యంగా లోకసభకు ఎన్నికవ్వడంతోపాటే కేంద్ర మంత్రిగా ఎదిగారు. అంతేకాదు కేంద్ర మంత్రిగా ప్రభుత్వ నిర్ణయాలను సరైన రీతిలో అమలుచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారంలో అన్ని విధాల ముందున్న నాయకురాలిగా పేరుంది.
Recommended Video


బాపట్ల తదితర ప్రాంతాల్లో ఆమెకు 'చిన్నమ్మ' అని పేరుంది కూడా. 2013లో తెలంగాణ ఏర్పాటును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో రాజంపేట స్థానం నుంచి ఓటమి పాలైనా.. బీజేపీ తరఫున ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
టిడిపికి మిత్రపక్షమమైనా బిజెపి నేతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా ప్రత్యేకంగా నిలిచారు. బిజెపికి ఆమె ఇప్పుడు అత్యంత ముఖ్యమైన నేతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిగణనలోకి వచ్చారు.












Click it and Unblock the Notifications