అమ్మాయిల్ని ఎరగా, నగ్న దృశ్యాలు తీసి టీవీ యాంకర్ బ్లాక్‌మెయిల్
అనంతపురం: అమ్మాయిలను మోసం చేసి వ్యభిచారకూపంలోకి లాగడం, అబ్బాయిలను ట్రాప్ చేసి, అనంతరం వారిని బ్లాక్ మెయిల్ చేస్తోందని ఓ స్థానిక టీవీ ఛానల్ యాంకర్ పైన ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కదిరి పోలీసులు సదరు యాంకర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని తెలుస్తోంది. ఆమె నుండి ఓ కంప్యూటర్, మూడు మెమోరీ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.
ఈమె బారినపడిన ఓ యువతి కొద్ది రోజులుగా కనిపించడం లేదు. ఆమె ఓ ఉత్తరం రాసి పెట్టి వెళ్లింది. సదరు యాంకర్ తనను వ్యభిచారంలోకి దింపిందని, నగ్న దృశ్యాలను చిత్రీకరించి వాట్సప్ ద్వారా చాలామందికి పంపించిందని పేర్కొంది.

పోలీసులు నిందితురాలితో పాటు మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకొని విచారించారని సమాచారం. యాంకర్‌గా చెబుతున్న ఆమె స్థానికంగా న్యూస్ రీడర్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.
సదరు టీవీ యాంకర్ అమ్మాయిలను ఎరగా వేసి అబ్బాయిలను ట్రాప్ చేస్తోంది. వీడియో తీసి అబ్బాయిలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తోంది. ఆమె విషయం బయటకు చెప్పుకోలేక, పోలీసులకు ఫిర్యాదు చేయలేక అబ్బాయిలు ఆమెకు డబ్బులు ఇచ్చుకుంటూ వస్తున్నారని తెలుస్తోంది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications