దిల్‌షుక్‌నగర్ పేలుళ్లు: హైదరాబాద్ కోర్టుకు నిందితులు
హైదరాబాద్: దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులను ఎన్ఐఎ అధికారులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, వకాస్ అలియాస్ జియా వుర్ రెహ్మాన్‌లను అధికారులు కోర్టులో హాజరు పరిచారు. నిందితులను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో కోర్టుకు తీసుకుని వచ్చారు.
వకాస్ పాకిస్తానీ జాతీయుడు. హైదరాబాదులోని దిల్‌షుక్‌నగర్‌లో 2013లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) ప్రత్యేక న్యాయమూర్తి ఐఎస్ మెహతా అంగీకరించారు.

దిల్‌షుక్‌నగర్ పేలుళ్లతో వారిద్దరికి సంబంధం ఉన్నట్లు ఏ విధమైన ఆధారాలు లేవని, వారిని ఒప్పించడం ద్వారా సాక్ష్యాలను తయారు చేయాలని ఎన్ఐఎ ప్రయత్నిస్తోందని డిఫెన్స్ తరఫు న్యాయవాది అక్రమ్ ఖాన్ అన్నారు
మార్చిలో అరెస్టయిన వకాస్‌కు పలు ఉగ్రవాద దాడులతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 2011 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసుతో అతనికి సంబంధం ఉంది. వకాస్‌ను అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ పోలీసులు తెహిసీన్‌ను అరెస్టు చేసారు. తెహసీన్ బాంబు తయారీలో నిపుణుడని తెలుస్తోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications