నాన్న కోసం నిహారిక ..నాన్నకు ఓటెయ్యండి , బాబాయి పార్టీని గెలిపించండని విజ్ఞప్తి
Recommended Video

నరసాపురం నుండి ఎన్నికల బరిలోకి దిగిన నాగబాబు కోసం తనయ నిహారిక రంగంలోకి దిగింది. తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తుంది. బాబాయి ఎన్నో ఆశయాలతో పార్టీ పెట్టారని , జనసేన ను గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని నిహారిక చెప్పారు.
నాన్న కోసం నిహారిక జనాల్లోకి వచ్చింది . నాగబాబు, నరసాపురం లోక్ సభ నియోజకవర్గానికి జనసేన తరఫున పోటీలో దిగగా, ఆయన కుమార్తె, సినీ నటి నీహారిక ప్రచారానికి వచ్చారు. తండ్రి తరఫున ప్రచారం చేసిన ఆమె, ఈ ప్రాంతం తమ సొంత ప్రాంతమని, ఇక్కడి ఓటర్లు తన తండ్రిని గెలిపిస్తారన్న నమ్మకం ఉందని మాట్లాడారు.అలాగే బాబాయి గురించి , జనసేన పార్టీ గురించి నిహారిక మాట్లాడారు. బాబాయి పార్టీని గెలిపించాలని కోరారు.

ఇక నరసాపురం అభ్యర్థిగా బరిలో ఉన్న నాగబాబు తాజాగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఒక పక్క టీడీపీని, మరో పక్క వైసీపీని ఏకి పారేస్తున్నారు. ఇక నాగబాబు ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ, జనసేనాని పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని అంశాలనూ నెరవేరుస్తారని అన్నారు. ఇక నిరుపేదలకు రేషన్ బదులు రూ. 2,500 డబ్బులు ఇస్తామని, పేదలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని తెలిపారు నాగబాబు . దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా, పేదలు ఇంకా పేదవారిగానే ఉన్నారని, ఆర్థిక అసమానతలు పోవాలంటే, జనసేన అధికారంలోకి రావాలని అన్నారు. ఇక పోటీలో ఉన్న జనసేన అభ్యర్థులందరినీ గెలిపించాలని నాగబాబు , నిహారికలు కోరారు.












Click it and Unblock the Notifications