జగన్ కేసు: ఇందూ టెక్ ఛార్జీషీట్‌లో మరికొందరి పేరు

YS Jagan
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించిన ఇందూ టెక్ అంశంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) మరో ఐదుగురి పేర్లను ప్రస్తావించింది. మంగళవారం సిబిఐ ఇందూ టెక్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశాల పైన ఛార్జీషీట్స్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఇందూ టెక్ అంశంలో మరికొందరి పేర్లను ప్రస్తావించింది. ఎ11గా నిమ్మగడ్డ ప్రసాద్, ఎ12గా నిమ్మగడ్డకు చెందిన ఈ2 కార్పోరేట్ సర్వీసెస్, ఎ13గా ఇందూ శ్యాంప్రసాద్‌కు చెందిన భూమి రియల్ ఎస్టేట్ ఇన్వెస్టిమెంట్స్, ఎ14గా జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా, ఎ15గా ఇందూ గ్రూప్ ఛార్జర్ అకౌంటెంట్ పివి కోటేశ్వర రావులను పేర్కొంది.

కాగా, జగన్ బెయిల్ పిటిషన్ పైన తీర్పు 23వ తేదికి వాయిదా పడింది. తనకు బెయిల్ కావాలని జగన్ పిటిషన్ దాఖలు చేసుకోగా, ఈ రోజు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. కోర్టులో సిబిఐ వాదనలు బుధవారం ముగిశాయి. అనంతరం తీర్పును కోర్టు వాయిదా వేసింది.

నిబంధనల ప్రకారమే: గీతా రెడ్డి

లేపాక్షి నాలెడ్జ్ హబ్ అంశానికి సంబంధించిన ఛార్జీషీటులో తనను పేర్కొనడంపై మంత్రి గీతా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. తాను నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చెప్పారట.

గీతా రెడ్డి రాజీనామా చేయాలి: నారాయణ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసుకు సంబంధించి తాజా ఛార్జీషీటులో మంత్రి గీతా రెడ్డి పేరు ఉన్నందున ఆమె వెంటనే రాజీనామా చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ వేరుగా డిమాండ్ చేశారు. గీతా రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిలకు పదవులలో కొనసాగే హక్కు లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+