నిమ్మగడ్డకు ఓటు హక్కు.. ఏపీ ప్రభుత్వంపై గెలుపు
విభజిత ఏపీకి తొలి ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరోసారి వార్తల్లో నిలిచారు. తన స్వగ్రామం ఉమ్మడి గుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఓటుహక్కును సాధించారు. తన సొంత ఊరిలో ఓటు హక్కును పొందడం కోసం ఆయన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వరకు వెళ్లాల్సి వచ్చింది. స్వగ్రామంలో తనకు ఓటుహక్కు కల్పించాలని గతంలో నిమ్మగడ్డ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి దరఖాస్తు చేసుకున్నారు.
రమేష్ కుమార్ ఆ ఊళ్లో నివాసం ఉండటం లేదనే కారణంతో దుగ్గిరాలలో ఓటు హక్కు కల్పించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో సొంతూరిలో ఓటు హక్కు కోసం ఆయన పోరాటం చేయాల్సి వచ్చింది. 2021లో హైకోర్టును ఆశ్రయించారు. దుగ్గిరాలతో తన తల్లి నివాసం ఉంటున్నారని, ఇల్లు, ఆస్తులు అక్కడే ఉంటున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. ఆయన దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలంటూ కోర్టు ఆదేశించింది. ప్రస్తుత దుగ్గిరాల ఓటర్ల జాబితాలో ఆయన పేరును చేర్చారు.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా పని చేసిన సమయంలో.. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో జగన్ సర్కారుతో ఆయన విబేధించారు. కరోనా నేపథ్యంలో ఆరువారాలు వాయిదా వేశారు. అతని నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన ప్రభుత్వం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పదవీకాలాన్ని తగ్గిస్తూ ఆర్డినెన్స్ తెచ్చింది. ఆర్డినెన్స్ ద్వారా తనను తొలగించడాన్ని నిమ్మగడ్డ వ్యతిరేకించారు. ఆయన్నే కొనసాగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం కోరగా ఎస్ఈసీ నిరాకరించారు. దీనిపై జగన్ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications