వందేభారత్ ప్రయాణికులకు అదిరిపోయే వార్త
వందేభారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతుండటంతో భారతీయ రైల్వే మరిన్ని వందే భారత్ రైళ్ల తయారీలో నిమగ్నమైంది. సెమీ హైస్పీడ్ రైళ్లుగా పట్టాలెక్కిన ఇవి 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అయితే రైలు పట్టాల సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి గంటకు 130 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతున్నారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను తయారు చేస్తున్న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి మరో తొమ్మిది వందేభారత్ లు బయటకు వచ్చాయి. ఈ తొమ్మిదిలో మూడు రైళ్లను సౌత్ రైల్వేకు కేటాయించారు. ఈ జోన్ లో ఇప్పటికే మూడు నడుస్తున్నాయి. ముంబయి కేంద్రంగా ఉన్న వెస్ట్రన్ రైల్వేకు మరో వందే భారత్ కేటాయించారు.నార్త్ వెస్ట్రన్, సౌత్ సెంట్రల్, ఈస్ట్ కోస్ట్ రైల్వే, ఈస్ట్ సెంట్రల్‌కు ఒక్కోటి ఇవ్వనున్నారు. మరో రైలును ఏ జోన్‌కూ ఇవ్వలేదు. దీన్ని త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్‌కు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొత్తగా సదరన్ జోన్‌కు మూడు రైళ్లను జులై 17, జులై 31, ఆగస్టు 18న జారీ చేశారు. ఇవన్నీ ఎనిమిది కోచ్‌ల రైళ్లు. వీటిని ప్రారంభించడానికి మంత్రిత్వ శాఖ ఒక ఈవెంట్ ను చేయబోతోంది. ఈ తొమ్మిదిలో రెండు రైళ్లు మాత్రం జైపూర్- జైపూర్-ఇండోర్; జైపూర్-ఉదయ్‌పూర్ రూట్లలో తిరిగే అవకాశం ఉంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఉదయపూర్, నీముచ్ రైల్వే స్టేషన్లను సందర్శించారు. ఈస్టకోస్ట్ కు కేటాయించిన రైలు ఒడిశాలోని పూరి-రూర్కెలా మధ్య తిరిగే అవకాశం ఉంది. 2024 ప్రారంభంలో ఒడిశా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దీన్ని ప్రవేశపెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications