చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నితీశ్ గైర్హాజరు - అసలు కారణం..!!

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసారు. 25 మంది మంత్రులతో ఎన్డీఏ కూటమి కొలువు తీరింది. ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ - సినీ సెలబ్రెటీలు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో మాూడు పార్టీల అభిమానుల ప్రత్యక్షంగా ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. చిరంజీవి, రజనీకాంత్ కార్యక్రమంలో ప్రత్యేకార్షణగా నిలిచారు. అయితే, చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ ముఖ్య నేత నితీశ్ గైర్హాజరయ్యారు. దీని వెనుక కారణాల పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్రంలో టీడీపీ, జేడీ(యూ)కీలకంగా ఉన్నాయి. ఫలితాలు వచ్చిన సమయం నుంచి ప్రధాని మోదీ మంత్రివర్గం ప్రమాణ స్వీకారం వరకు చంద్రబాబు - నితీశ్ అన్నింటా ముఖ్య భూమిక పోషించారు. కేంద్ర కేబినెట్ లో రెండు పార్టీలు రెండు పదవులు కేంద్రంలో దక్కాయి. చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా నితీశ్ ను ఆహ్వానించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలను స్వయంగా ఆహ్వానం పలికారు. ప్రధాని మోదీతో సహా అమిత్ షా, గడ్కరీ, పలువురు కేంద్ర మంత్రులు..ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.

Nitish Absent at Chandrababus swearing in ceremony Is he sending a message to the NDA

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నితీశ్ రాకపోవటం వెనుక కారణం ఏంటనేది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో చర్చ జరుగుతోంది. నితీవ్ కేంద్రంలో తమకు ఇచ్చిన మంత్రి పదవుల సంఖ్య , శాఖల పైన గుర్రుగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే రాలేదని ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే...ప్రధాని మోదీ ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబుకు తాను ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో స్పష్టం చేసారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం పూర్తయిన తరువాత ఆలింగనం చేసుకొని అభినందించారు. ఎన్డీఏలో ఎంపీ స్థానాల సంఖ్యా పరంగా బీజేపీ తరువాతి స్థానంలో టీడీపీ ఉంది. అయితే, నితీశ్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవటం పైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+