సంచలనం కోసమే ఎంపీల అవిశ్వాసం: పొన్నాల

తెలంగాణ బిల్లుపై శాసనసభలో ఓటింగు జరగదని, సభ్యుల అభిప్రాయాల సేకరణ మాత్రమే ఉంటుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క అన్నారు సోనియా గాంధీపై తమ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నామని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు.
ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నవారికి ఇకనైనా కాంగ్రెసు పార్టీ నుంచి ఉద్వాసన పలకాలని ఆయన అన్నారు. అధికారం కోసం వచ్చిన కొందరు నాయకులు పార్టీని విమర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను ఆయన కలిశారు.
జెసి దివాకర్ రెడ్డికి మతిభ్రమించిందని నల్లగొండ జిల్లా ఆలేరు శానససభ్యుడు బూడిద బిక్షమయ్య గౌడ్ వ్యాఖ్యానించారు. జెసి కోరుకున్న రాయల తెలంగాణ ఇస్తే సోనియా గాంధీ మంచివారయ్యేవారని ఆయన వ్యాఖ్యానించారు. యువ నాయకత్వాన్ని కోరుతున్న జెసి తప్పుకుని యువకుడికి ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications