TTD: శ్రీవారి దర్శన టికెట్లు మిగిలిపోతున్నాయా - టీటీడీ క్లారిటీ..!!

Tirumala: తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. ఈ సారి వేసవి సెలవుల్లో రద్దీ పెరుగుతుందనే అంచనాలతో టీటీడీ అధికారులు భారీ ఏర్పాట్లు చేసారు. బ్రేక్ దర్శనాలను రద్దు చేసారు. జూలై 15వ తేదీ వరకు సిఫారసు లేఖలను అనుమతించమని వెల్లడించారు. అయితే, టీడీపీ అంచనా లు తప్పుతున్నాయి. వేసవి రద్దీ ఆశించిన స్థాయిలో లేదు. దర్శన క్యూ లైన్లు కొన్ని సందర్భాల్లో ఖాళీగా కనిపిస్తున్నాయి. అనూహ్యంగా వారం రోజులుగా శ్రీవాణి దర్శన టికెట్లు సైతం మిగిలిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటి పైన టీటీడీ స్పష్టత ఇచ్చింది.

తిరుమలలో ఈ సారి వేసవి సెలవుల్లో భిన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రతీ ఏటా వేసవి లో తిరుమల భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ సారి అదే అంచనాలతో టీటీడీ ముందస్తు చర్యలను చేపట్టింది. వీఐపీ లేఖలను రద్దు చేసింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులకే బ్రేక్ దర్శనాలను పరిమితం చేసిం ది. అటు ఆపరేషన్ సింధూర్ తో అంచనాలు తారు మారు అయ్యాయి. ప్రతీ వేసవిలోనూ దర్శనా నికి భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లతో పాటు క్యూ లైన్లు కిలో మీటర్ల మేర వ్యాపిస్తాయి. ఈ ఏడాది మాత్రం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో మే 1 నుంచి 10వ తేదీ వరకు 7,04,760 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, ఈ సారి కూడా అదే సంఖ్యలో 7,04,689 మంది శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.

no-demand-for-srivani-quota-tickets-in-tirumala-details-here

మిగిలిన దర్శన టికెట్లు -క్లారిటీ
సాధారణంగా తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లు ఆన్ లైన్ తో పాటుగా ఆఫ్ లైన్ లో భక్తులు పోటీ పడి మరీ దక్కించుకుంటారు. నిమిషాల వ్యవధిలో టికెట్లు పూర్తి అవుతాయి. అయితే, తాజాగా తిరుమల శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లకు ఆదరణ తగ్గినట్లు కనిపిస్తోంది. వారం రోజులుగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లు భారీగా మిగిలిపోతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీని పైన టీటీడీ స్పష్టత ఇచ్చింది. ఇందులో నిజం లేదని తేల్చింది. వాస్త‌వానికి ఆన్ లైన్‌లో 500 టికెట్లు, తిరుప‌తి ఎయిర్ పోర్ట్ లో 200 టికెట్లను అందుబాటులో ఉంచ‌గా ఎప్ప‌టిక‌ప్పుడు భ‌క్తులు బుక్ చేసేసుకుంటున్నారని వెల్లడించింది. ఏరోజు కూడా ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు మిగిలిన సంద‌ర్భం లేదని క్లారిటీ ఇచ్చింది. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ప్రతిరోజు 800 టికెట్లను భక్తులకు ఆఫ్ లైన్ లో జారీ చేస్తున్నట్లు వివరించింది. గత కొన్ని రోజుల్లో ఆఫ్ లైన్ లో పదుల సంఖ్యలో తగ్గాయేకాని,వందల సంఖ్యలో మిగల లేదని స్పష్టత ఇచ్చింది.

యుద్దం ఎఫెక్ట్
అయితే, టీటీడీ వేసవి రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసినా.. అంచనాలు తప్పాయి. ఈ ఏడాది వేసవి సెలవుల్లో రద్దీ పెరగకుండా సాధారణంగానే ఉండటానికి ఆపరేషన్ సింధూర్.. తదనంతర పరిణామాలే కారణంగా టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది వేసవికి రద్దీ విపరీతంగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేసినప్పటికీ ఉద్రిక్తతల నేపథ్యంలో సాధారణ రద్దీ నెలకొంది. ఈ నెలలో 1, 2 తేదీలు మినహా ఏ రోజూ కంపార్టు మెంట్లు పూర్తిస్థాయిలో నిండలేదు. దీంతో కేవలం 7 నుంచి 12 గంటల్లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుమల పర్యటన పూర్తి చేసుకుంటున్నారు. తిరుమల అత్యంత రద్దీతో కూడుకున్న ప్రదేశం కావడంతో చాలా మంది భక్తులు యుద్ధ పరిస్థితి చక్కబడిన తర్వాత స్వామి దర్శనానికి వెళ్లచ్చనే అభిప్రాయంతో తమ పర్యటనను వాయిదా వేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+