కిరణ్ కుమార్ రెడ్డి పోకతో కాంగ్రెస్ కు నో లాస్ ! రాకతో బీజేపీకి ఉపయోగం ఉందా ?

ఏపీలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గత నెలలో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇవాళ బీజేపీలో చేరిపోయారు. చేరిన వెంటనే కాంగ్రెస్ ను వీడటానికి, బీజేపీలో చేరడానికి గల కారణాలను కూడా చెప్పేశారు. అవి ఎంత మేరకు కన్విన్సింగ్ గా ఉన్నాయన్నది పక్కనబెడితే ఆయన పార్టీ మార్పు ప్రభావం ఆయన తాజా, మాజీ పార్టీలపై ఏ మేరకు పడబోతోందన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలో సాగుతోంది.

ఒకప్పుడు స్పీకర్ గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఒక్క సీల్డ్ కవర్ సందేశంతో సీఎంను చేసేసింది. విపక్ష నేత జగన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు మరో రెడ్డి అవసరం పడిన వేళ.. కిరణ్ ను అందుకు తగ్గ ఆప్షన్ గా ఎంచుకున్న కాంగ్రెస్ కు అదెంత తప్పుడు నిర్ణయమో తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రవైపు నిలబడినట్లు నటించి తన అవసరాలు చక్కబెట్టుకున్న కిరణ్.. చివరి బంతికి సిక్సర్ కొడతానంటూ అందరినీ మోసం చేశారు. చివరికి పార్లమెంటులో బిల్లు పెట్టగానే సీఎం పదవికి, కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. వెంటనే ఎలాంటి హోం వర్క్ చేయకుండానే చెప్పుల గుర్తుతో సమైక్యాంధ్ర పార్టీ పెట్టి ఘోరంగా ఓడిపోయారు. ఎన్నికల తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరిపోయారు.

no loss to ap congress

సీన్ కట్ చేస్తే కొన్నేళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నా క్రియాశీలకంగా లేకుండా, అంటీముట్టనట్టుగా ఉండిపోయిన కిరణ్ కుమార్ రెడ్డి.. తాజాగా కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన సహజంగానే ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు. దానికి కారణం అంతకు ముందు ఏడేళ్లుగా ఆయన వహిస్తున్న మౌనమే. అయితే తాజాగా ఇవాళ బీజేపీలో ఆయన చేరడం కూడా ఆశ్చర్యం కలిగించడం లేదు. దీనికి కారణం ప్రస్తుతం ఏపీలో నోటాతో పోటీ పడుతున్న బీజేపీలో కిరణ్ చేరిక ఆ పార్టీకి మేలు చేస్తుందన్న అంచనాలు కూడా ఎవరికీ లేకపోవడమే. బండి సంజయ్ లా దూకుడుగా రాజకీయాలు చేసే వైఖరి కానీ, బీజేపీని ఉన్నపళంగా పైకి లేపే సామర్ధ్యం కానీ కిరణ్ కు లేవు. కేవలం మాజీ సీఎం ట్యాగ్ మాత్రమే ఆయనకు పనికొస్తోంది.

దీంతో ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ మార్పు రాష్ట్రంలో కాంగ్రెస్ కు నష్టం లేదు, బీజేపీకి లాభం లేదన్న చందంగా తయారవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో ఇప్పటికే పలు వర్గాలు ఉన్నాయి. కులాల వారీగా నేతలు విడిపోయి రాజకీయాలు చేసుకుంటున్నారు. ఏపీలో బీజేపీని గెలిపించాలన్న పట్టుదల కానీ, గెలవాలంటే అనుసరించాల్సిన వ్యూహం కానీ వారి దగ్గర ఎలాగో లేదు. ఇలాంటి సమయంలో కొత్త వ్యూహాలు ఇచ్చే పరిస్ధితి కిరణ్ వద్దకూడా లేదు. దీనికి తోడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుతో సమన్వయం రూపంలో ఇప్పుడు కిరణ్ కు పెద్ద సవాల్ ఎదురు కాబోతోంది. కిరణ్ కు బీజేపీ అప్పగించే పదవిపైనా చర్చ జరుగుతోంది. ఏదేమైనా కిరణ్ కు బీజేపీలో సవాళ్లు తప్పేలా లేవు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+