కాంగ్రెసులో కలవం, ఒంటరిగానే పోటీ: కెసిఆర్ క్లారిటీ
హైదరాబాద్: కాంగ్రెసులో పార్టీని విలీనం చేసే విషయంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మరోసారి స్పష్టత ఇచ్చారు. ఎట్టి పరిస్థితిలోనూ కాంగ్రెసులో తమ పార్టీని విలీనం చేయబోమని ఆయన అన్నారు. పార్టీ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన శనివారం ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు.
వచ్చే ఎన్నికల్లో 110 శాతం తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, ఇదే విషయాన్ని పార్టీ నాయకులు కార్యకర్తలకు చెప్పాలని ఆయన అన్నారు. తాను మాట్లాడేందుకు కొన్ని పరిమితులుంటాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాంగ్రెసులో తెరాస విలీనమవుతుందనే వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కెసిఆర్ గతంలో పలుమార్లు చెప్పారు. హైదరాబాద్ విషయంలో మీడియా కథనాలను తాము నమ్మబోమని తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి అన్నారు. పేచీలు పెట్టి తెలంగాణ ఇస్తే మరోసారి యుద్ధం చేస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు పేచీలు లేని తెలంగాణను తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు
తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాల మీద రాలేదని, అమర వీరుల త్యాగాల వల్ల.. ప్రజల ఉద్యమం వల్ల తెలంగాణ వచ్చిందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను కించపరిస్తే మరోసారి పోరాటం చేస్తామని ఆయన అన్నారు.
సీమాంధ్ర కృత్రిమ ఉద్యమాన్ని చూసి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కదలిపోయారని, తెలంగాణ ఉద్యమంలో వేయి మంది విద్యార్థులు మరణించినా చంద్రబాబుకు బాధ అనిపించలేదని తెరాస నాయకుడు జూపల్లి కృష్ణా రావు అన్నారు. చంద్రబాబు సీమాంధ్రుడేనని ఆయన సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో అన్నారు.












Click it and Unblock the Notifications