ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చంద్రబాబుకు దక్కని ఊరట !
ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ కూడా ఊరట దక్కలేదు. హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో ఆయన దాఖలు చేసుకున్న రెండు కీలక పిటిషన్లపై విచారణ ముందుకు సాగలేదు. దీంతో ఆయన ఎల్లుండి వరకూ వేచి చూడాల్సిన పరిస్దితి. మరోవైపు సుప్రీంకోర్టులో మాత్రం చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం విచారణ జరగబోతోంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ కూడా మరోసారి విచారణ ప్రారంభమైంది. ఇరువర్గాల లాయర్లు తమ వాదనలు వినిపించారు. అయితే దీనిపై ఎటూ తేల్చని హైకోర్టు ధర్మాసనం విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది.

మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు నిన్న ఆయన హెల్త్ అప్ డేట్స్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఇవాళ వాదనలు ప్రారంభించింది. అయితే దీనిపై సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. సీఐడీ నుంచి కౌంటర్ దాఖలు అయ్యాక దీనిపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించనుంది. దీంతో చంద్రబాబు హెల్త్ అప్ డేట్స్ విషయంలోనూ ఆయనకు ఊరట దక్కలేదు.












Click it and Unblock the Notifications