Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అమరావతిలో రెండో విడత భూసమీకరణ సై- ఆ గ్రామాలు ఇవే

రాజధాని అమరావతి భూసమీకరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. రెండో విడత భూసమీకరణకు పూనుకుంది. ఇదివరకు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన ప్రతిపాదనలకు అనుగుణంగా మలిదశ సమీకరణ దిశగా ముందడుగు వేసింది.

రెండో విడత భూసమీకరణకు సంబంధించిన నోటిఫికేషన్ కొద్దిసేపటి కిందటే విడుదలైంది. రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాల్లో తాజా భూసమీకరణ చోటు చేసుకుంది. ఈ విడతలో మొత్తం 16,666.56 ఎకరాలను సమీకరించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇదివరకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాలగు రోజుల్లోనే నోటిఫికేషన్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందనేతి అర్థమౌతోంది.

Notification Issued for 16666 Acres Land Pooling in 2nd Phase Across 7 Villages in Andhra Capital

మొదటి విడతలో 34,400 ఎకరాలు సేకరించిన సీఆర్‌డీఏ. తాజాగా 16,666.56 ఎకరాలతో ఈ సంఖ్య 50,000 చేరినట్టయింది. రాజధాని నిర్మాణం కోసం మొదటి విడత భూసమీకరణలో మొత్తం 28,526 మంది రైతులు 34,400 ఎకరాలను సీఆర్‌డీఏకు అప్పగించారు. 16,000 ఎకరాల ప్రభుత్వ భూమితో కలుపుకొని మొత్తం 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరుగనుంది. రాజధాని ప్రాంతంలో రైల్వేస్టేషన్‌, రైల్వే లైన్‌, స్పోర్ట్స్‌ సిటీ, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఈ 16,666 ఎకరాల భూమిని సమీకరించనుంది.

ఇందులో సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడిల్లో 7,562 ఎకరాలు ఉన్నాయి. అలాగే వడ్డేమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలు సమీకరిస్తుంది ప్రభుత్వం. ఆయా గ్రామాల్లో 3,828 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. రెండో విడతలో భాగంగా ఈ భూమి మొత్తాన్నీ కూడా సమీకరిస్తుంది ప్రభుత్వం. ఈ విడతలో భూములు ఇచ్చిన రైతులకు కూడా గతంలో అమలు చేసిన పరిహారాలే వర్తిస్తాయి. జరీబు భూమికి నివాస స్థలం 1,000, వాణిజ్య ప్లాటు 450 గజాలు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. మెట్ట భూములకు నివాస స్థలం 1,000, వాణిజ్య ప్లాటు 250 గజాలు పరిహారంగా ఇస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+