Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎన్టీపీసీలో నాలుగు యూనిట్లు ట్రిప్ - నిలిచిన విద్యుత్ ఉత్పత్తి : 2 వేల మెగావాట్ల మేర..!!

విశాఖలోని సింహాద్రి, హిందూజా ఎన్టీపీసీ ప్లాంట్లలో విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. దక్షిణాది గ్రిడ్ లో తలెత్తిన లోపం కారణంగా విద్యుదుత్పత్తి ఆగింది. తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాంకేతికలోపం తలెత్తడంతో.. విద్యుతుత్పత్తి నిలిచింది. గ్రిడ్​కి విద్యుత్ ప్రసార లైన్లలో ఏర్పడిన సమస్య వల్ల అకస్మాత్తుగా ప్లాంట్లలోని విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. పరిసరప్రాంతాలు అంధకారంగా మారాయి. దాదాపు రెండు గంటల తర్వాత గ్రిడ్ నుంచి విద్యుత్ సరఫరా తిరిగి ఆరంభం కావడంతో సింహాద్రిలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు.

హిందూజాలోనూ విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. అత్యవసర ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఒకేసారి సింహాద్రి నాలుగు యూనిట్లు, హిందూజా రెండు యూనిట్లు ఉత్పత్తి నిలిచిపోవడం ఇదే తొలిసారి. ఎండా కాలంలో ఇలాంటి లోపాలు తలెత్తడం వల్ల రాష్ట్రంలో మరింతగా విద్యుత్ కోతలు సంభవించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, దీని పైన అధికారులు వివరణ ఇచ్చారు.

NTPC Simhadri clarifies on Power outage, production will start in all units within the evening

భారీ గాలులు, వర్షం వల్ల 2 సబ్‌స్టేషన్లు ట్రిప్‌ అయ్యాయని ఎన్టీపీసీ తెలిపింది. కలపాక, గాజువాక సబ్‌స్టేషన్లు ట్రిప్ అయినట్లు పేర్కొంది. నేషనల్ గ్రిడ్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ట్రిప్ కారణంగా 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని వెల్లడించింది. ఎన్టీపీసీలో ఉత్పత్తయ్యే విద్యుత్ 2 సబ్‌స్టేషన్ల నుంచి గ్రిడ్‌కు వెళ్లాల్సి ఉందని.. 2 సబ్‌స్టేషన్లు ట్రిప్ కావడంతో సింహాద్రిలోని 4 యూనిట్లు ట్రిప్ అయ్యాయని వివరించింది.

సాయంత్రంలోపు అన్ని యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. 1, 4 యూనిట్లు విద్యుదుత్పత్తికి సిద్ధమైనట్లు తెలిపింది. కాసేపట్లో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని పేర్కొంది. 2, 3 యూనిట్లలో మరమ్మతులు చివరి దశలో ఉన్నాయని ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+