దేవర సినిమా చూసేదాకా అయినా బ్రతికించండి.. వైద్యులకు ఎన్టీఆర్ వీరాభిమాని విజ్ఞప్తి!
క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలని డాక్టర్లను వేడుకున్నాడు. అయితే ఇందులో అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం ఏమిటంటే దేవర సినిమా చూసేవరకైనా తనను బ్రతికించాలి అని అతను డాక్టర్లను వేడుకోవడం ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది.
సెప్టెంబర్ 27వ తేదీ వరకు బ్రతికించండి
ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 సంవత్సరాల వయసు ఉన్న కౌశిక్ అనే యువకుడు ప్రస్తుతం ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం చికిత్స తీసుకుంటున్నాడు. బోన్ క్యాన్సర్ బారిన పడిన కౌశిక్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ డాక్టర్లను తనను సెప్టెంబర్ 27వ తేదీ వరకు దేవర సినిమా రిలీజ్ వరకు బ్రతికించాలని కోరుతున్నాడు.

ఎన్టీఆర్ పై వీరాభిమానం
ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం చూసేవరకైనా తనను బ్రతికించాలని కౌశిక్ విజ్ఞప్తి చేస్తున్నారు. దేవర సినిమాను చూడడమే తన చివరి కోరిక అని చెబుతున్న కౌశిక్ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ అతని కోరిక నెరవేరాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.
ఎన్టీఆర్ పై కుమారుడి అభిమానం చెప్పి కన్నీరు పెట్టుకున్న తల్లిదండ్రులు
ఇక కౌశిక్ విషయానికి వస్తే చిన్నప్పటినుంచి ఎన్టీఆర్ అంటే కౌశిక్ కు చాలా ఇష్టమని, బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తమ కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, ఇంత అనారోగ్యంలో కూడా ఎన్టీఆర్ సినిమా చూడాలని కోరుకుంటున్నాడని, అప్పటివరకు బ్రతికించమని డాక్టర్లను వేడుకుంటున్నాడని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ మీడియాతో చెప్పారు.
ఎన్టీఆర్ దాకా చేరాలని యువకుడి వీడియో పోస్ట్ చేస్తున్న అభిమానులు
బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న తన కొడుకు వైద్యానికి 60 లక్షల రూపాయలు ఖర్చవుతుంది అని డాక్టర్లు చెప్పారని కౌశిక్ తల్లి చెబుతున్నారు. ప్రభుత్వం దాతలు తమకు సహాయం చేయాలని వారు అర్ధిస్తున్నారు. ఎన్టీఆర్ పైన వీరాభిమానంతో దేవర సినిమా చూసేవరకు బ్రతికించమని విజ్ఞప్తి చేస్తున్న కౌశిక్ ఆరోగ్య పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్ వరకు చేరాలని ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని కూడా ట్యాగ్ చేస్తూ కౌశిక్ వీడియోను పోస్ట్ చేస్తున్నారు.
Please help Anna 🙏#ManofMassesNTR @tarak9999#Devara @DevaraMovie pic.twitter.com/CggAxQxkss
— Jr NTR Fan Club (@JrNTRFC) September 12, 2024
ఎన్టీఆర్ దాకా ఈ క్యాన్సర్ బాధితుడి ఆక్రందన చేరుతుందా ?
ఇక ఈ విషయం ఎన్టీఆర్ వరకు చేరితే ఆయన తప్పకుండా సహాయం చేస్తారని ఎన్టీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. దేవర సినిమా చూడటం మాత్రమే కాదు, బోన్ క్యాన్సర్ ని కూడా కౌశిక్ జయించి మళ్లీ ఆరోగ్యంగా బ్రతకాలని కోరుకుంటున్నామని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చెబుతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ క్యాన్సర్ బాధితుడి ఆక్రందన చేరుతుందా? ఎన్టీఆర్ స్పందిస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications