పవన్ కళ్యాణ్ కు ఎన్టీఆర్ అభిమానులతో పెద్ద కష్టమే వచ్చిందిగా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపితో పొత్తుకు ఉవ్విళ్ళూరుతున్న పవన్ కళ్యాణ్ కు తాజాగా ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇస్తామని చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపితో పొత్తుకు ఉవ్విళ్ళూరుతున్న పవన్ కళ్యాణ్ కు తాజాగా ఎన్టీఆర్ అభిమానులు షాక్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇచ్చేదే లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా సంకేతాలు ఇస్తున్నారు. అసలు పవన్ కళ్యాణ్ కు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మధ్య వచ్చిన పంచాయితీ ఏంటి? ఎందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విధంగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తున్నారు? అసలేం జరిగింది అంటే..

ఆర్ఆర్ఆర్ సినిమా గురించి రాం చరణ్ కు అభినందనలు : పవన్ కళ్యాణ్ పోస్ట్

ఇటీవల పవన్ కళ్యాణ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల ఈవెంట్ లో రామ్ చరణ్ పాల్గొనడంతో రామ్ చరణ్ కు అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ విడుదల చేసిన ప్రకటనలో ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో ఆర్ఆర్ ఆర్ పలు పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ వేదికపై బెస్ట్ వాయిస్, మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మెన్స్ ను రామ్ చరణ్ ద్వారా ప్రకటింపజేయడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. రామ్ చరణ్ కి, దర్శకులు రాజమౌళికి, చిత్ర బృందానికి అభినందనలు అని పేర్కొన్న పవన్ కళ్యాణ్ చరణ్ మరిన్ని మంచి చిత్రాలు చేసి అందరి మన్ననలు పొంది ఘనవిజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్.

ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం .. వచ్చే ఎన్నికలకు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్టులు

ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం .. వచ్చే ఎన్నికలకు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్టులు

ఇక్కడే అసలు తంటా వచ్చింది. ఇది ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తుంది. పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో ఎక్కడ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోవడం వారి ఆగ్రహానికి కారణంగా మారింది. దీంతో పవన్ మీద ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఇదే సమయంలో 2024 అసెంబ్లీ ఎన్నికలలో తమ మద్దతు ఎట్టి పరిస్థితులలోనూ ఉండబోదని పరోక్షంగా పోస్టులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికలకు ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అంటూ, రాం చరణ్ కోసం పవన్ పోస్ట్ చేసిన లెటర్ హెడ్ ని రీ పోస్ట్ చేస్తూ.. మీరు ఇలా ఉంటే మా మద్దతు ఎలా ఉంటుంది అంటూ ఇన్ డైరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు.

పవన్ పోస్ట్ పై రాజకీయంగా స్పందిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

పవన్ పోస్ట్ పై రాజకీయంగా స్పందిస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్


పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీలో ఒకడైన రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చేసిన ఎఫర్ట్ ని మెచ్చుకుంటూ పోస్ట్ పెట్టడం కరెక్టే అయినప్పటికీ, అందులో రాంచరణ్ తో సమానంగా సత్తా చాటిన ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సినిమాకు సంబంధించిన వ్యవహారాన్ని రాజకీయాలకు ముడిపెట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రస్తావించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నందమూరి మెగా ఫాన్స్ దగ్గరవుతారు అనుకుంటే ఇక తాజా పరిణామాలు అందుకు భిన్నంగా తయారు కావడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+