రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక
రాష్ట్రంలో తిరిగే రైళ్లతోపాటు రాష్ట్రంమీదగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లించింది. విజయవాడ, గుంటూరు డివిజన్ల పరిధిలో మౌలిక సదుపాయాల కోసం పనులు జరుగుతున్న కారణంగా వీటి రద్దుతోపాటు మళ్లింపు చేపట్టామని వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎంకే త్రిపాఠి ప్రకటన విడుదల చేశారు. ఏయే రైళ్లు రద్దైనవో, ఏ రైళ్లను మళ్లించారో తెలుసుకుందాం.
రద్దైన రైళ్ల వివరాలు
నడికుడి-కాచిగూడ(07792), కాచిగూడ-నడికుడి(07791)
మచిలీపట్నం-గుడివాడ(07869), గుడివాడ-మచిలీపట్నం(07868)
విజయవాడ-విశాఖపట్నం(22702), విశాఖపట్నం-విజయవాడ(22701)
విశాఖపట్నం-గుంటూరు(17240), గుంటూరు-విశాఖపట్నం(17239)
విశాఖపట్నం-కాకినాడ పోర్ట్(17268), కాకినాడ పోర్ట్-విశాఖపట్నం(17267)

బిట్రగుంట-విజయవాడ(07977), విజయవాడ-బిట్రగుంట(07978)
చెన్నై సెంట్రల్-బిట్రగుంట(17238), బిట్రగుంట-చెన్నై సెంట్రల్(17237)
విజయవాడ-గుంటూరు(07783), గుంటూరు-విజయవాడ(07788)
గుంటూరు-మాచర్ల(07779), మాచర్ల-గుంటూరు(07780)
మాచర్ల-నడికూడి(07580), నడికూడి-మాచర్ల(07579)
తెనాలి-రెపల్లె(07875), రెపల్లె-తెనాలి(07876)
నర్సాపూర్-గుంటూరు(17282), గుంటూరు-నర్సాపూర్(17281)
గుంటూరు-డోన్(17228) రైళ్లను ఈనెల 26వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు రద్దుచేశారు.
డోన్-గుంటూరు(17227) రైలును ఈనెల 27వ తేదీ నుంచి జులై 3వ తేదీ వరకు రద్దు చేశారు.
గుంటూరు-కాచిగూడ(17251), కాచిగూడ-గుంటూరు(17252) రైళ్లను ఈనెల 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు రద్దు చేశారు.
రేపల్లె-మార్కాపురం(07889), మార్కాపురం-తెనాలి(07890) రైళ్లను గుంటూరు-మార్కాపురం, మార్కాపురం-గుంటూరు మధ్య 26వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు.
హుబ్లీ-విజయవాడ(17329) రైలును నంద్యాల-విజయవాడ మధ్య ఈనెల 26వ తేదీ నుంచి 4వ తేదీ వరకు,
విజయవాడ-హుబ్లీ(17330) బండిని విజయవాడ-నంద్యాల మధ్య 27 నుంచి 5వ తేదీ వరకు పాక్షికంగా రద్దు చేశారు.












Click it and Unblock the Notifications