ప్రభుత్వ ఆసుపత్రిలో ఐటమ్ సాంగ్‌కి స్టాఫ్ నర్సులు స్టెప్పులు..పలువురు సస్పెండ్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వేదికగా షాకింగ్ సంఘటన వెలుగు చూసింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వర్తించాల్సిన కొందరు నర్సింగ్ సిబ్బంది ఐటమ్ సాంగ్స్ కు డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆసుపత్రిలో పేషంట్లు ఉన్నారు అన్న విషయాన్ని కూడా మరిచిపోయి వారు డాన్సులు చేసిన వీడియో ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

మహిళా దినోత్సవం ముందు రోజు ఆస్పత్రిలో ఐటమ్ సాంగ్ కు నర్సుల డ్యాన్స్

వైరల్ అయిన వీడియోలో ఇద్దరు నర్సులు ఉత్సాహంగా నృత్యం చేస్తున్నారు. మరికొందరు సిబ్బంది చప్పట్లు కొడుతూ వారిని ప్రోత్సహిస్తున్నారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో మహిళా దినోత్సవం ముందు రోజు జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన పైన తీవ్రంగా స్పందించిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తక్షణం విచారణకు ఆదేశించారు.

Nurses dance in rajahmundry govt hospital staff nurses suspended Showcause notices to nurses

నర్సులు చేసిన డ్యాన్సులపై బయట పెద్ద ఎత్తున విమర్శలు

రోగుల సంరక్షణలో నర్సుల పాత్ర కీలకమైనది. అటువంటి నర్సులు రోగుల సంక్షేమాన్ని పక్కనపెట్టి ఆసుపత్రి వేదికగా డాన్సులు చేయడం అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆస్పత్రిలో పేషెంట్స్ ఉన్నారన్న ఇంగితం కూడా లేకుండా నర్సులు చేసిన డ్యాన్సులపై బయట పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, స్టాఫ్ నర్సులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేయడం పైన తీవ్రంగా స్పందించారు.

ఆ నర్సులు సస్పెండ్

తక్షణ చర్యలను తీసుకుంటూ హెడ్ నర్సులు మెర్సీ మరియు ఈశ్వరిలను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు వీరిద్దరూ డాన్స్ చేస్తుంటే, ప్రోత్సహించిన మరో 12మంది నర్సింగ్ సిబ్బందికి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఎవరైనా సరే విధినిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఆస్పత్రులలో పని చేసే వారికి హెచ్చరిక

పవిత్రమైన వైద్య వృత్తిలో ఇలాంటి ధోరణి మంచిది కాదని నిర్లక్ష్య పూరితమైన చర్యలు ఆమోదయోగ్యం కాదని ఉన్నతాధికారులు అంటున్నారు. మొత్తంగా ఇటువంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉంటుందని తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+