జనసేన నెంబర్ టూ మంత్రి శాఖలో స్కామ్, తిరుపతి పక్కలోనే !!
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అధికారులలో మార్పులు రావడం లేదని మరోసారి వెలుగు చూసింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో జరిగిన ఓ స్కామ్ కు సంబంధించి పౌరసరఫరాల శాఖ స్కామ్ విషయంలో ఆ శాఖ అధికారులు, పోలీసులు ఒక్కటి అయ్యారని, అసలు మ్యాటర్ బయటకు రాకుండా చూశారని, అందరూ డ్రామాలు ఆడారని వెలుగు చూసింది.
అయితే ఈ విషయంలో కలెక్టర్ మీద కూడా ఆరోపణలు రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఉందని, ఇంకా చాలా మంది అధికారులు వైసీపీ మూడ్ లోనే ఉన్నారని, అలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు శాఖల అధికారులను హెచ్చరించారు. అయినా కూడా చాలా ప్రాంతాల్లో చాలా మంది అధికారులు ఇంకా వైసీపీ వాసనలోనే ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ఆహార పౌరసరఫరాల శాఖలో గోదాం సీఎస్ డీటీగా పని చేస్తున్న విష్ణు భాగోతం బయటకు వచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండతో విష్ణు ఈ గోదాం ఇన్ చార్జ్ గా వచ్చాడు. అయితే గోదాం ఇన్ చార్జ్ అయిన విష్ణు సుమారు రెండు కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారని ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూడటంతో ఆ శాఖలోని ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పుత్తూరు గోదాం పరిధిలో 109 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతినెల పుత్తూరు గోదాం నుంచి అన్ని రేషన్ షాపులకు సుమారు 25 వేల బియ్యం బస్తాలు సరఫరా అవుతున్నాయి. ఇదే సమయంలో పుత్తూరు గోదాం ఇన్ చార్జ్ విష్ణు చేతివాటం చూపించారు. గత నెల తిరుపతి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి సుమతి పుత్తూరు గోదాంను ఆకస్మికంగా తినిఖీలు చేశారు. ఆ సందర్బంలో స్టాక్ రిజిస్టర్ చూసిన సుమతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మొత్తం రికార్డులు పరిశీలించగా గోదాంలో సుమారు 205 టన్నుల బియ్యం పక్కదారి పట్టిందని వెలుగు చూసింది. ఈ విషయంపై విష్ణు మీద ఇదే నెల 12వ తేదీన పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు మ్యాటర్ ఏమిటంటే అప్పటికే విష్ణు మాయం అయ్యాడు. విష్ణును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ శుభం భన్సల్ ఫైల్ పై సంతకం కూడా చేశారు. ఆ తరువాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ మ్యాటర్ బయటకు రాకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు విష్ణు వ్యవహారం బయటకు రాకుండా చూడటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

విష్ణు వైసీపీ నాయకులకు సన్నిహితుడు అని, అందుకే మ్యాటర్ బయటకు రాకుండా పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. మ్యాటర్ బయటకు రావడంతో విష్ణు మాయం కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ విషయం గురించి కూటమి నాయకుటు సీఎం చంద్రబాబు నాయుడు, డీసీఎం పవన్ కల్యాణ్, పౌరసరఫరాల శాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ కు సమాచారం ఇచ్చారు.












Click it and Unblock the Notifications