Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

శరవేగంగా చంద్రబాబు నిర్ణయాలు ! అధికారులపై వేటు, ఆఫీసుల సీజ్, అమరావతి క్లీన్..!

ఏపీలో నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు మళ్లీ తనదైన శైలిలో పాలన మొదలుపెట్టేశారు. ఎన్నికలు గెలిచాక ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రమాణస్వీకారంతో సంబంధం లేకుండానే ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చంద్రబాబు.. ఇవాళ, రేపట్లో కూడా మరిన్ని ఆదేశాలు ఇవ్వబోతున్నారు. దీంతో చంద్రబాబు స్పీడ్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

చంద్రబాబు ఎల్లుండి గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న సభాస్ధలిలో ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే అంతకు ముందే ఆయన అధికార యంత్రాంగంలో కదలిక తెచ్చేశారు. వచ్చీ రాగానే దూకుడుగా నిర్ణయాలకు తెర లేపారు. దీంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం కదులుతోంది.

officials removal to Amaravati Chandrababu key decisions before oath ceremony on jun 12

ఇప్పటికే వివాదాస్పద అధికారులను పక్కన పెడుతూ వరుసగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. ఆయా కార్యాలయాల నుంచి డాక్యుమెంట్లు మాయం అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు ఆఫీసులు సైతం సీజ్ చేశారు. వైసీపీతో అంటకాగిన అధికారుల కదలికలపై ఫోకస్ పెట్టారు. చంద్రబాబు ఆలోచనల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఇప్పటికే పలు శాఖలకు ఆదేశాలు జారీ అవుతున్నాయి.

మరోవైపు రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున జంగిల్ క్లియరెన్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పిచ్చి మొక్కలు తొలగింపు, రోడ్లు బాగుచేడంతో పాటు, గతంలో జరిగిన నిర్మాణాల వద్ద పనులు మొదలుపెట్టేశారు. ప్రమాణ స్వీకారం తరువాత జరిగే రివ్యూలకు కీలక శాఖల అధికారులు సన్నద్ధమవుతున్నారు. పోలవరం స్థితిగతులపై వాస్తవాలతో ఇరిగేషన్ అధికారులు నివేదికలు సిద్దం చేస్తున్నారు.

విద్యుత్ శాఖలో ట్రాన్స్ కో, జెన్ కో లలో పరిస్థితిపై సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు... రాష్ట్రంలో అనేక చోట్ల కనీసం వీధిదీపాలు వెలగని పరిస్థితిని తెలుసుకుని వెంటనే చక్కదిద్దాలని ఆదేశాలు ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం పై దృష్టిపెట్టాలని చంద్రబాబు సూచించారు. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధులకు అస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విజయవాడలో కొద్దిరోజుల క్రితం కలుషిత తాగునీటి తో మరణాల నేపథ్యంలో తాగునీటి సరఫరాపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.

సాటు నీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యత సమాచారం తెప్పించుకున్న చంద్రబాబు.. ఏ మాత్రం సమయం వృధా చేయకుండా వ్యవస్థలను గాడిలో పెట్టే పనులకు శ్రీకారం చుట్టారు. వీఐపీల రాకపోకల పేరుతో ట్రాఫిక్ నిలిపివేత వంటి చర్యలు వద్దని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. తన కాన్వాయ్ వెళుతున్న సమయంలో ప్రజలు ఇబ్బంది పడేలా ట్రాఫిక్ ఆపోద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చారు. రోజుల వ్యవధిలోనే పాలనలో మార్పు చూపించాలనే అభిప్రాయంతో కాబోయే ముఖ్యమంత్రి ఆలోచనలు, నిర్ణయాలు ఉంటున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రమాణస్వీకారం రోజు తొలి సంతకం పెట్టబోయే మెగా డీఎస్సీ కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో వారు టీచర్ల ఖాళీలను గుర్తించే పనిలో పడ్డారు. రేపటి లోగా ఈ జాబితా సీఎంవోకు చేరబోతోంది. అనంతరం ఎల్లుండి ప్రమాణస్వీకారం తర్వాత చంద్రబాబు మెగా డీఎస్సీ నిర్వహణకు వీలుగా సిద్ధం చేసిన ఫైలుపై గతంలో ఇచ్చిన హామీ మేరకు సంతకం చేయబోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+