విజయవాడ, విశాఖపట్నం ప్రజలకు శుభవార్త

రోజురోజుకు రైళ్లల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. రద్దీనికి అనుగుణంగా రైల్వే ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. అంతేకాకుండా ప్రతిరోజు నడిచే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేందుకు కృష్టిచేస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల నుంచి నడుస్తున్న రైళ్లకు, రాష్ట్ర పరిధిలో నడిచే రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు అదనపు బోగీలను ఏర్పాటు చేశారు. ఈ సౌకర్యాలను గమనించి అందుకనుగుణంగా రిజర్వేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు 18463 నెంబరుతో నడుస్తున్న రైలుకు ఈనెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, అలాగే బెంగళూరు నుంచి భువనేశ్వర్ కు 18464 నెంబరుతో నడుస్తున్న రైలుకు ఈనెల 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఇప్పుడున్న బోగీలతోపాటు ఓ థర్డ్ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే భువనేశ్వర్ నుంచి తిరుపతికి నడిచే 22879 రైలుకు 16వ తేదీన, తిరుపతి నుంచి భువనేశ్వర్ కు నడిచే 22880 రైలుకు 17వ తేదీన ఓ థర్డ్ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేశారు.

Officials said that additional bogies are being arranged for trains running in AP

విశాఖ-న్యూఢిల్లీ 20805 రైలుకు 15 నుంచి 30 వరకు
న్యూఢిల్లీ-విశాఖ 20806 రైలుకు 17 నుంచి డిసెంబరు 2 వరకు సెకండ్ ఏసీ బోగీ ఏర్పాటు.
విశాఖ నుంచి ఎల్టీటీ 22847 రైలుకు 24న
ఎల్టీటీ నుంచి విశాఖ 22848 రైలుకు 26న
విశాఖ-డిఘా 22847 రైలుకు ఈనెల 28న
డిఘా-విశాఖ 22873 రైలుకు ఈనెల 29న ఒక థర్డ్ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేస్తున్నారు.

గాంధీధామ్-పూరీ 22973 రైలుకు 20, 27 తేదీల్లో
పూరీ-గాంధీధామ్ 22974 రైలుకు 23, 30 తేదీల్లో అదనంగా ఓ స్లీపర్ బోగీని ఏర్పాటు చేస్తున్నారు.

గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే సింహాద్రి 17239 రైలును 14న రద్దు చేశారు
విశాఖపట్నం నుంచి గుంటూరుకు వెళ్లే సింహాద్రి 17240 రైలును 15న రద్దు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+