వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ మై గాడ్..! కుప్పంలో బాబు మెజారిటీకి బారీ గండి..! కార‌ణం అదేనా..??

|
Google Oneindia TeluguNews

అమ‌రావ‌తి/హైద‌రాబాద్: ఏపీలో అదికార పార్టీ కి చెందిన నేత‌లు చాలా మంది ఈ ఎన్నిక‌ల్లో అగ్నిప‌రీక్ష‌ను ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా డ‌జ‌నుకు పైగా మంత్రులు ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇక అదే కోవ‌లో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిల‌వడం విశేషం. బాబు మెజారిటీ ఈ సారి భారీగా తగ్గనుందా?.అంటే ఔననే అంటున్నారు ఆ నియోజకవర్గ ప్రజలు. ఈ నియోజకర్గంలో చంద్రబాబు గెలుపునకు ఢోకా లేకపోయినా..మెజారిటీ మాత్రం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల పనులు జరిగినా కూడా అక్కడ టీడీపీ నేతల అవినీతి అంశం దీని కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే చ‌ర్చ జ‌రుగుతోంది.

 ఎదురీదుతున్న అదికార పార్టీ నేత‌లు..! బాబు త‌గ్గ‌నున్న మెజారిటీ..!!

ఎదురీదుతున్న అదికార పార్టీ నేత‌లు..! బాబు త‌గ్గ‌నున్న మెజారిటీ..!!

ఈ సారి చంద్రబాబు మెజారిటీ తగ్గటానికి ఇదే ప్రధాన కారణం కానుందని టీడీపీ నాయకులే అభిప్రాయపడుతున్నారు. స్థానిక టీడీపీ నేతలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అది వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని, దీని వల్ల గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి చంద్రబాబుకు మెజారిటీ తగ్గటం ఖాయమ‌ని ఎక్కువ మంది అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

నియోజ‌క వ‌ర్గాల్లో టీడిపి నేత‌ల నిర్ల‌క్ష్య వైఖ‌రి..! ఆందోళ‌న‌లో పార్టీ క్యాడ‌ర్..!!

నియోజ‌క వ‌ర్గాల్లో టీడిపి నేత‌ల నిర్ల‌క్ష్య వైఖ‌రి..! ఆందోళ‌న‌లో పార్టీ క్యాడ‌ర్..!!

2014 ఎన్నికల్లో చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి 47121 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు ఎన్నికల కంటే ఇది చాలా తక్కువ. గతంలో వైసీపీ నుంచి ప్రత్యర్ధిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళినే ఈ సారి కూడా ఆ పార్టీ తరపున చంద్రబాబుతో తలపడుతున్నారు. మార‌న రాజ‌కీయ ప‌రిణామాల ప్ర‌కారం ప్ర‌తిప‌క్ష వైసీపి అక్క‌డ పుంజుకుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)

 కుప్పం టీడిపి నేత‌ల్లో అవినీతి..! అసంత్రుప్తి వ్య‌క్తం చేస్తున్న స్థానికులు..!!

కుప్పం టీడిపి నేత‌ల్లో అవినీతి..! అసంత్రుప్తి వ్య‌క్తం చేస్తున్న స్థానికులు..!!

అయితే ఈ సారి చంద్రబాబు మెజారిటీ మరింత తగ్గుతుందనే అంశంపై టీడీపీ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. ఓ వైపు రాష్ట్రంలో టీడీపీ మిషన్ 150 టార్గెట్ పేరుతో పనిచేస్తుందని చెబుతున్న చంద్రబాబు ప్రతి ఏటా తన మెజారిటీ తగ్గుతున్నా పట్టించుకోవటంలేదనే వ్యాఖ్యాలూ విన్పిస్తున్నాయి. అయితే ఓ ముఖ్యమంత్రి నియోజకవర్గంలో జరగాల్సినంత అభివృద్ధి మాత్రం జరగలేదనే విమర్శలు కుప్పం న‌డి వీధుల్లో వినిపిస్తున్నాయి.

 బ‌ల‌ప‌డిని ప్ర‌తిప‌క్ష పార్టీ..! అభివ్రుద్ది ప‌నుల్లో వెన‌క బ‌డ్డ అదికార పార్టీ..!!

బ‌ల‌ప‌డిని ప్ర‌తిప‌క్ష పార్టీ..! అభివ్రుద్ది ప‌నుల్లో వెన‌క బ‌డ్డ అదికార పార్టీ..!!

ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే ఏకంగా ముఖ్య‌మంత్రి నియోజకవర్గంలోని బాలికల పాఠశాలల్లో కనీస సౌకర్యాలైన టాయిలెట్లు కూడా లేవని వైసీపీ విమర్శించటం, అందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు అసెంబ్లీ సాక్షిగా అంగీకరించటం అప్పట్లో కలకలం రేపింది. సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి కంటే అవినేతే ఎక్కువ ఉందనే అభిప్రాయం ఆ నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అందుకే చంద్ర‌బాబు మెజారిటీకి ఈ సారి భారీగా గండి ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

English summary
That's what the constituent people say. Even if Chandrababu is not in the fray in this constituency, the majority will likely lose significantly. There are debates about the corruption of the TDP leaders in the Kuppam constituency, even if in the schemes of government hundreds of crores of rupees are done.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X