పవన కళ్యాణ్ ను మరోసారి అడ్డుకొని.. : పోలీసులతో స్థానికులు వాగ్వాదం: ఉద్రిక్తంగా వెంకటపాలెం..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రాజధాని గ్రామాల్లో పోలీసులు అడ్డుకున్నారు. మందడం గ్రామంలో దీక్ష చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించేందుకు పవన్ కళ్యాన్ అక్కడకు చేరుకొనేందుకు ప్రయత్నిం చగా పోలీసులు అడ్డుచెప్పారు. మందడం గ్రామంలోకి వెళ్లేందుకు అనుమతి లేదని..సచివాలయం నుండి ముఖ్యమంత్రి తిరిగి వెళ్లేవరకు వెళ్లనీయమని పోలీసులు స్పష్టం చేసారు. నేరుగా తుళ్లూరు వెళ్లాలని పోలీసులు స్పష్టం చేసారు. దీంతో..కాన్వాయ్ వదిలేసి కాలి నడకన కిష్టాయపాలెం నుండి వెంకటపాలెం చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మొహరించారు. రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంచెలు ఏర్పాటు చేసారు.

మందడం గ్రామస్థులు..రైతులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పవన్ ను మందడంలోకి రావటానికి అనుమతి ఇవ్వాలని నినాదాలు చేసారు. పవన కు మద్దతుగా నిలిచారు. పోలీసుల తో వాగ్వాదానికి దిగారు. పవన్ కు మద్దతుగా ఆయనతో పాటుగా స్థానిక గ్రామాల ప్రజలు..రైతులు కాలి నడకన మందడం చేరుకుంటున్నారు. అయితే, కాసేపట్లో ముఖ్యమంత్రి తిరిగి వెళ్లిపోతారని..ఆ వెంటనే గ్రామం లోకి అనుమతి స్తామని పోలీసులు నచ్చ చెప్పారు. అక్కడ పెద్ద సంఖ్యలో స్థానికులు...పవన్ అభిమానులు చేరుకొని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Once again police restricted pawan Kalyan with out entering him in to Mandadam village

కాలినడకన మందడంకు పవన్..
కిష్టాయపాలెం వద్ద మందడం వెళ్లేందుకు పోలీసులు నిరాకరించటంతో పవన్ కళ్యాణ్ పాదయాత్రగా వెంకటపాలెం చేరుకున్నారు. అక్కడ సైతం పోలీసులు పెద్ద ఎత్తున మొహరించి పవన్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పోలీసు అధికారులు కొద్ది సేపు వేచి ఉండాలని పవన్ ను అభ్యర్ధించారు. పవన్ కు మద్దతుగా వచ్చిన మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పవన్ తమ గ్రామంలోకి రావాలని ఆహ్వానించారు.

అడ్డుకున్న పోలీసుల పైన మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా స్థానికులు వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద రోడ్డు పైనే బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. అయితే, పోలీసుల సూచనల మేరకు కొద్ది సేపు వేచి చూసేందుకు పవన్ అంగీకరించారు. వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద అనుచరులతో కలిసి నిరీక్షిస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో స్థానిక గ్రామాల ప్రజలు..జనసేన మద్దతు దారులు అక్కడికి చేరుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+