జమిలిపై టీడీపీ సంచలన ప్రకటన..లోక్‌సభ సాక్షిగా: రూ.లక్ష కోట్ల వ్యయం..!!

One Nation One Election: వన్ నేషన్- వన్ ఎలక్షన్ దిశగా కసరత్తు ముమ్మరమైంది. ఈ బిల్లును- అధికార ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం లోక్‌సభ సమక్షానికి తీసుకొచ్చింది. ఈ మధ్యాహ్నం సరిగ్గా 12:30 గంటలకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ దీన్ని సభలో ప్రవేశపెట్టారు.

దేశవ్యాప్తంగా ఒకే విడతలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలను నిర్వహించడానికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లునూ ఆయన టేబుల్ చేశారు. దీన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టడానికి గల కారణాలనూ క్లుప్తంగా వివరించారు.

One Nation One Election Bill TDP MP and Minister Pemmasani Chandrasekhar welcome the bill

ఈ బిల్లు టేబుల్ అయిన వెంటనే కాంగ్రెస్ గట్టిగా వ్యతిరేకించింది. దీన్ని ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ సహా ఇండియా బ్లాక్‌కు చెందిన మిత్రపక్షాల సభ్యలు తమ స్థానాల నుంచి లేచి నిల్చున్నారు. బిల్లుకు వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలంటూ పట్టుబట్టారు.

ఈ బిల్లు వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని, ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటుందని, సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందంటూ కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. దీన్ని ఆమోదించడం ఏ మాత్రం సరికాదని అన్నారు. సభా కార్యకలాపాలు ముందుకు సాగకుండా అడ్డుపడటానికి ప్రయత్నించారు. దీనితో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.

ఈ గందరగోళ పరిస్థితుల మధ్యే ఎన్డీఏ సంకీర్ణ కూటమిలో కీలక భాగస్వామిగా ఉంటూ వస్తోన్న తెలుగుదేశం పార్టీ- ఈ బిల్లును స్వాగతించింది. సంపూర్ణ మద్దతును తెలియజేసింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీకి చెందిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. ఈ బిల్లుకు పూర్తి మద్దతును ప్రకటించారు.

దేశమంతా ఒకే దశలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలను నిర్వహించాలనుకుంటోన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తోన్నామని పెమ్మసాని పేర్కొన్నారు. దీనివల్ల ఓట్ల శాతం పెరుగుతుందని, ఓటర్లల్లో పెద్ద ఎత్తున చైతన్యం వెల్లివిరుస్తుందని వ్యాఖ్యానించారు. దేశంలో గల అన్ని పార్టీల ఎన్నికల వ్యయం లక్ష కోట్ల రూపాయలుగా ఉంటోందని అన్నారు.

One Nation One Election Bill TDP MP and Minister Pemmasani Chandrasekhar welcome the bill

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలను నిర్వహించడం వల్ల అటు ఎన్నికల కమిషన్‌కు, ఇటు ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల ఖర్చు భారీగా తగ్గుతుందని పెమ్మసాని చెప్పారు. కేంద్రం, రాష్ట్రాల్లో ఏర్పడిన ప్రభుత్వాలకు ఎన్నికల ఇబ్బందులు ఉండబోవని, అయిదేళ్ల కాలం పాటు మనుగడ సాగించగలుగుతాయని పేర్కొన్నారు.

దేశంలో ఆరు నెలల వ్యవధిలో మూడు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని పెమ్మసాని గుర్తు చేశారు. ప్రతి సంవత్సరం ఎక్కడో ఓ చోట ఎన్నికలను నిర్వహించాల్సి రావడం సరైంది కాదని తాము అభిప్రాయపడుతున్నామని చెప్పారు. అందుకే ఈ బిల్లుకు తాము మద్దతు పలుకుతున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+