ఎవరూ ఊహించని రీతిగా..రాజ్యసభకు ఆర్ కృష్ణయ్య: ముందే చెప్పిన వన్ ఇండియా
ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికవబోతున్న నలుగురు సభ్యుల పేర్లు దాదాపు ఖరారయ్యాయని తెలుస్తోంది. వీరిలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. విజయసాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్‌రావుతోపాటు లాయర్ నిరంజన్‌రెడ్డి, పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.వీరిలో ఎవరనేది రెండురోజుల్లో అధికారికంగా ప్రకటించబోతున్న తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్న కృష్ణయ్యను చంద్రబాబునాయుడు ఒక ప్రయోగం చేద్దామనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి మరీ 2014లో ఎల్‌బీ నగర్ సీటిచ్చారు. అక్కడ గెలిచినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. 2019 ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని మిర్యాలగూడ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఉప ఎన్నికలు జరిగిన సమయంలో అధికార టీఆర్ ఎస్‌కు మద్దతు పలికారు.

ఇటీవలి కాలంలో కృష్ణయ్య సొంత పార్టీ ఏర్పాటంటూ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీకి మద్దతుగా ఏపీలో ప్రచారం చేశారు. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు కృష్ణయ్యను ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభకు ఎంపిక చేస్తుండొచ్చేమోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హైకోర్టులో జగన్ కేసులను వాదించే లాయర్ నిరంజన్ రెడ్డి పేరు కూడా తాజాగా రాజ్యసభ్యుల ఎంపికలో చేరింది. ఆచార్య సినిమాకు ఆయన ఒక నిర్మాతగా కూడా వ్యవహరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి జెండా మోసిన కార్యకర్తలు, నాయకులు, నేతలు చాలామంది ఉన్నారని, వారంతా కాకుండా తెలంగాణ నుంచి వచ్చిన కృష్ణయ్యకు సీటివ్వడమేమిటంటూ వైసీపీలో అసంతృప్త స్వరాలు వినపడుతున్నాయి. ఇదిలా ఉంటే రాజ్యసభకు కృష్ణయ్య పేరును సీఎం పరిశీలిస్తున్నట్లు వన్‌ఇండియా నెల రోజుల ముందే చెప్పడం విశేషం.












Click it and Unblock the Notifications