టమాటా తర్వాత క్యూలో నిలుచున్న ఉల్లిపాయ
టమాటాను మర్చిపోతున్న ప్రజలు ఉల్లిపాయలను కూడా మర్చిపోవడానికి సిద్ధమవ్వాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో టమాటా రాష్ట్రాన్ని బట్టి రూ.200 నుంచి రూ.300 వరకు ఉంది. బహిరంగ మార్కెట్ లో టమాటాతోపాటు అల్లం, పచ్చిమిర్చి, క్యాప్సికం ధరలు ఆకాశ్శానంటుతున్నాయి. తాజాగా ఉల్లిపాయలు కూడా ఈ జాబితాలో చేరాయి. ఆగస్టు చివరి నాటికి రిటైల్ మార్కెట్ లో వీటి ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
సెప్టెంబరు నెలకు కిలో ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.70 మధ్యలో చేరవచ్చని క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ అండ్ అనలిటిక్స్ పేర్కొంది. రబీలో ఉల్లిపాయ నిల్వ కాలం 2 నెలలు తగ్గింది. ఈ నిల్వలు ఈ నెలాఖరుకు తగ్గుముఖం పడతాయని, దీనివల్ల సెప్టెంబరులో సరఫరాలు తగ్గి ధరలు పెరుగుతాయని క్రిసిల్ విశ్లేషించింది.

అక్టోబరులో ఖరీఫ్ పంట లభ్యత పెరుగుతుందని, ఆ సమయంలో ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని తెలిపింది. తృణధాన్యాలు, పప్పు ధాన్యాలు, ఇతర కూరగాయల ధరలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ ఏడాది జనవరి నుంచి మే నెలల మధ్యలో ఉల్లి ధరలు తగ్గడంతో కాస్తంత ఉపశమనం పొందారు. ఆశించిన ధర లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ లో పంట తక్కువగా పండించారు. దాదాపుగా 8 శాతం తగ్గింది. వార్షిక ఉత్పత్తి 29 మిలియన్ టన్నులుచేరుతుంది.
ఖరీఫ్, రబీలో దిగుబడి తక్కువగా కనిపించినప్పటికీ మరీ ఇబ్బంది పడేంతగా ఏమీ జరగకపోవచ్చని, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నమోదయ్యే వర్షపాతాన్ని బట్టి పంట ఆధారపడివుంటుందని క్రిసిల్ పేర్కొంది. సరఫరా-డిమాండ్ అసమతుల్యతే ఉల్లిపాయల ధరల్లో ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. సెప్టెంబరు ప్రారంభం నుంచి ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, లీన్ ప్యాచ్ అయితే 2020 గరిష్టస్థాయి కంటే తక్కువగా ఉంటాయని క్రిసిల్ తెలిపింది.












Click it and Unblock the Notifications