అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Child pornography: రంగంలో దిగిన సీబీఐ: ఏపీ సహా పలు రాష్ట్రాల్లో విస్తృత దాడులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఛైల్డ్ పోర్నోగ్రఫీ.. అభం శుభం తెలియని చిన్న పిల్లలపై లైంగికదాడులకు పాల్పడటం, వారిని వేధించడం, శారీరక కోరికలను తీర్చుకోవడానికి చిన్నపిల్లలను వినియోగించుకోవడం వంటి ఆకృత్యాలు దేశంలో పెచ్చరిల్లిపోయాయి. ఆన్‌లైన్ ఛైల్డ్ పోర్నోగ్రఫీ విస్తృతమైంది. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు యథేచ్ఛగా పెరిగిపోయాయి. చిన్నారులను ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తున్నాయి. ఏపీ కూడా దీనికి మినహాయింపు కాదు. ఇక్కడా అలాంటి దారుణాలు వెలుగులోకి వస్తోన్నాయి.

ఛైల్డ్ పోర్నోగ్రఫీ యథేచ్ఛగా సాగుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ రంగంలోకి దిగింది. ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. మొత్తంగా 76 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఈ దాడులను కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది.

Online child sexual abuse case: CBI is conducting searches at around 76 locations in 14 States/UTs

ఛైల్డ్ పోర్నోగ్రఫీపై సీబీఐ అధికారులు ఆదివారం వేర్వేరు రాష్ట్రాల్లో 23 కేసులను నమోదు చేశారు. 83 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన సందర్భంగా కీలక విషయాలను రాబట్టారు. ఈ ఛైల్డ్ సెక్సువల్ రాకెట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని కూపీలాగారు. నిందితులు ఇచ్చిన పక్క సమాచారం, ఆధారాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీబీఐ అధికారులు 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులకు దిగారు.

Online child sexual abuse case: CBI is conducting searches at around 76 locations in 14 States/UTs

ఏపీ, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, బిహార్, ఒడిశా, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లల్లో 76 ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. విజయవాడ, గుంటూరుల్లో సీబీఐ అధికారులు ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తోన్నప్పటికీ.. దీన్ని ఎవరూ అధికారికంగా ధృవీకరించలేదు. దీనిపై సీబీఐ అధికారులు ఓ అధికారిక ప్రకటనను జారీ చేస్తారని చెబుతున్నారు. ఏకకాలంలో ఈ దాడులు చేపట్టడం.. సంచలనం రేపుతోంది.

ఈ దాడుల్లో పలు సెక్స్ రాకెట్స్ గుట్టు రట్టవుతున్నట్లు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలు, సెక్స్ పార్లర్లుగా మారిన పలు మసాజ్ సెంటర్ల, ఇంటర్‌నెట్ కెఫేలపైనా ఈ దాడులు సాగుతున్నట్లు సమాచారం అందుతోంది. పలు పెన్‌డ్రైవ్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఛైల్డ్ సెక్స్ రాకెట్ బిజినెస్‌తో ముడిపడి ఉన్న పలువురిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఆకృత్యాలతో ముడిపడి ఉన్న వారిని వదలబోమని అధికారులు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.

English summary
Allegations of online child sexual abuse and exploitation case, CBI is conducting searches at around 76 locations in 14 States/UTs including Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X