గంజాయి ధ్వంసానికి ఆపరేషన్ పరివర్తన్; అయినా ఏపీలో ఆగని దందా; పట్టుబడుతున్న గంజాయి!!
జగన్ సర్కార్ గంజాయి నిర్మూలన పై దృష్టి సారించింది. గంజాయి సాగు విచ్చలవిడిగా జరుగుతుందని, గంజాయి సాగును ధ్వంసం చేయడం లేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆపరేషన్ పరివర్తన్ కు శ్రీకారం చుట్టింది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గంజాయిని సమూలంగా నాశనం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో అధికారులు గంజాయి క్షేత్రాలను ధ్వంసం చేయడానికి రంగంలోకి దిగారు.
ఏపీ గంజాయి సాగు ధ్వంసం చేస్తున్నా సాగుతున్న అక్రమ రవాణా
ఒకవైపు గంజాయి క్షేత్రాల ధ్వంసం కొనసాగుతుంటే మరోవైపు గంజాయి అక్రమ రవాణా యధేచ్చగా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతుంది. ఏపీ గంజాయిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా సరే గంజాయి స్మగ్లర్లు దందా మాత్రం ఆపటం లేదు. రోడ్డు, రైలు మార్గాల ద్వారా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ గంజాయి సాగు పై, గంజాయి హబ్ గా ఏపీ మారుతున్న తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

బొలెరో వాహనంలో తరలిస్తున్న 100 కిలోల గంజాయి పట్టివేత
ఇతర రాష్ట్రాలలో పట్టుబడ్డ గంజాయి సైతం మూలాలు ఏపీ లోనే మూలాలు కనిపిస్తున్నాయని జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇంతా జరుగుతున్నా తాజాగా విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి తరలిస్తున్న గంజాయిని వాహన తనిఖీలల్లో పట్టుకున్నారు. బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని గొలుగొండ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కొయ్యూరు మండలం ధర్మవరం వద్ద వాహన తనిఖీలు చేపట్టి న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు లక్షలు విలువ చేసే 100 కిలోల గంజాయిని పట్టుకున్నట్టు వెల్లడించారు.
తాడిపర్తి జంక్షన్ లో 60 కిలోల గంజాయి పట్టివేత
మరోవైపు విశాఖ జిల్లా మాడుగుల మండలం తాడిపర్తి జంక్షన్ వద్ద బుధవారం మాడుగుల పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో 60 కిలోల గంజాయిని పట్టుకున్నారు. తాటిపర్తి జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా విశాఖ మన్యం నుంచి తీసుకు వస్తున్న 60 కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కు తరలించారు.
గంజాయి సాగుపై జాయింట్ ఆపరేషన్ .. రెండున్నర కోట్ల విలువైన గంజాయి ధ్వంసం
ఇదిలా ఉంటే ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో తూర్పు గోదావరి జిల్లా పోలీసులు గంజాయి సాగుపై జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం చింతూరు సబ్ డివిజన్ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సాగు పై ఉక్కుపాదం మోపారు. అక్కడ ఒడియా క్యాంపులో నివసిస్తున్న చాలామంది గంజాయి సాగు చేస్తున్నారని గుర్తించిన పోలీసులు పది ఎకరాల్లో సాగు అవుతున్న గంజాయిని ధ్వంసం చేశారు. ఎకరానికి 5000 చొప్పున పది ఎకరాల్లో నాటిన సుమారు రెండు కోట్ల 50 లక్షలు విలువైన 50000 గంజాయి మొక్కలను పోలీసులు ధ్వంసం చేశారు. ఇదిలా ఉంటే విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి మండలం పెద్ద వలస పంచాయతీ పరిధిలోని గ్రామాలలో గంజాయి తోటలను పోలీసులు ధ్వంసం చేశారు సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్న తోటలను ధ్వంసం చేసి నిప్పంటించారు.
-
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
మావిగన్ చర్చ వేళ సీఆర్డీఏ పరిధి పై కీలక నిర్ణయం- ఇక ఇలా..!! -
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications