50 లక్షల రైతులకు అండగా - లక్షా 33వేల కోట్లు లబ్ది: ఆ క్రెడిట్ సీఎం జగన్ ఒక్కరికే..!
ఏపీ ప్రభుత్వం రైతు భరోసాలో ముందు నిలుస్తోంది. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు భరోసా కల్పిస్తోంది. రైతులకు తోడుగా వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం అమలు చేస్తోంది. నవరత్నాల్లో ప్రకటించిన విధంగా..ఇప్పటి వరకు వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పధకం ద్వారా మేలు చేస్తోంది. ఇచ్చిన మాట కంటే మిన్నగా రైతు భరోసా సాయం ఐదు సంవత్సరాల పాటు రూ.13,500 చొప్పున.. చెప్పిన మాట కంటే మిన్నగా అదనంగా రూ.17,500 అందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ పథకాల ద్వారా ఈ మూడున్నరేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రైతన్నలకు రూ.1,33,526.92 కోట్ల లబ్ధి చేకూర్చింది.

రైతులకు ఇచ్చిన మాట మేరకు
2014 ఎన్నికల్లో నాడు టీడీపీ రైతు రుణ మాఫీ ప్రకటించింది. మొత్తం 87 వేల కోట్లకు గాను..15 వేల కోట్లు మాత్రమే రుణ మాఫీ చేయటం పై ప్రతిపక్ష నేతగా జగన్ ప్రతీ సందర్భంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పాదయాత్ర..ఎన్నికల ప్రచారంలోనూ ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే ఏటా మూడు విడతలుగా రూ 1,500 ఇవ్వాలని నిర్ణయించారు. అధికారంలోకి వచ్చిన తరువాత 2019 అక్టోబర్ లో తొలి విడత నిధులు విడుదల చేసారు. ఆ తరువాత ఈ మొత్తాన్ని చెప్పిన దాని కంటే ఎక్కువగా ఇస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ 13,500 అందిస్తున్నారు. ఇందులో కేంద్రం నుంచి ఆరు వేలు అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ 7500 అందిస్తోంది.

50 లక్షల మంది రైతులకు లబ్ది
దీంతో పాటుగా రైతులకు ఏ సీజన్ లో నష్టపోయినా..అదే సీజన్ లో పరిహారం అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ద్వారా విత్తనాలు..ఎరువులు అందుబాటులోకి తెచ్చారు. అదే విధంగా వ్యవసాయ అనుంబంధ రంగాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ఏడాదిలో నాలుగో ఏడాది మొదటి విడతగా మే నెలలో ఖరీష్‌కు ముందే రైతులకు ఒక్కొక్కరికీ రూ.7,500 చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అందించింది. నేడు రెండో విడతగా పంట కోతలు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికీ మరో రూ.4000 చొప్పున 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో కంప్యూటర్ బటన్ నొక్కి సీఎం వైయస్ జగన్ నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసారు.

మూడున్నారేళ్ల కాలంలో లక్షా 33 వేల కోట్లు
తాజాగా అందుతున్న సాయం రూ.2,096.04 కోట్లతో కలిపి ఈ మూడేళ్ల నాలుగు నెలల్లో కేవలం వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం ద్వారానే వైయస్ జగన్ ప్రభుత్వం రూ.25,971.22 కోట్లు రైతులకు అందించారు. 50 లక్షల మంది రైతులకు సీఎం జగన్ అండగా నిలుస్తుండగా ..వారంతా జగన్ కు మద్దతుగా నిలుస్తామని చెబుతున్నారు. సంక్షేమ పథకాల అమల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం జగన్..రైతు సంక్షేమంలోనూ అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రూతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైయస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా రూ.13,500 అందిస్తుండటంపైన కౌలు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications