మారుతున్న లెక్కలు, నేరుగా రంగంలోకి - సీఎం జగన్ తాజా నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబు(Chandra Babu) అరెస్ట్..పొత్తు రాజకీయంతో ఇప్పుడు పరిణామాలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి. ఈ సమయంలోనే ముఖ్యమంత్రి జగన్ (CM YS Jagan) తన ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ప్రజాశీర్వాదం పొందేందుకు ప్రజలతో మమేకం కానున్నారు. కార్యాకర్తలతో సమావేశాలు..అభ్యర్దుల ప్రకటనకు సిద్దం అవుతున్నారు. ఇక, ప్రతిపక్షాలను(AP Opposition) ప్రజల మధ్యే టార్గెట్ చేసేందుకు డిసైడ్ అయ్యారు.

ప్రజల్లోకి సీఎం జగన్:ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల్లోనే ఉంటూ ముఖ్యమంత్రి అయిన జగన్(CM Jagan)..మరోసారి తనను ఆశీర్వదించమంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో ప్రతిపక్షాలు ప్రభుత్వంపైన ఆరోపణలు చేస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు అరెస్ట్(Chandra Babu Arrest) తో టీడీపీలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను పూర్తిగా అనుకూలంగా మలచు కోవాలని వైసీపీ భావిస్తోంది. అయితే, చంద్రబాబు అవినీతి చేసి అరెస్ట్ అయ్యారని..ఇందులో రాజకీయ ప్రమేయం లేదని అసెంబ్లీ(Assembly) వేదికగా ప్రజలకు చెప్పేందుకు సిద్దమయ్యారు. ఈ సమయంలోనే.. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు సీఎం సిద్దమయ్యారు.

Opinion: CM Jagan likely to start Election campaign with Prajaswrivada Yatra in next month as Reports

పాలనా - పార్టీ వ్యవహారాలపై:ముఖ్యమంత్రి జగన్ వచ్చ నెల నుంచి ఇక ప్రజల మధ్యనే ఉండనున్నారు. ప్రజాశీర్వాద యాత్ర పేరుతో ప్రజల మద్దతు పెంచుకొనే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తాను ప్రజలనే నమ్ముకున్నానని పలు సభల్లో సీఎం జగన్(CM YS Jagan) చెబుతూ వచ్చారు. తనకు ఎటువంటి పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో వై నాట్ 175 నినాదంతో ఎన్నికల సమరానికి సిద్దమయ్యారు. ఇప్పటికే సర్వేల ద్వారా నియోజకవర్గాల వారీగా అభ్యర్దుల లెక్కలతో సిద్దమయ్యారు. జిల్లాల పర్యటన (Districts Tour)వేళ నేరుగా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు..కార్యాకర్తలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. అక్కడి ప్రాంతీయ - సామాజిక సమీకరణాలు..ప్రత్యర్ది పార్టీల ఆశావాహులు...అక్కడి స్థానిక పరిస్థితులను పార్టీ నేతలతో చర్చించి..వారికి దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రత్యర్ధి పార్టీలే టార్గెట్:ఇక, వైసీపీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయనున్నారు. అక్కడ ఎన్నికల్లోగా చేపట్టాల్సిన కార్యాచరణను సూచించనున్నారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన పూర్తి సమాచారంతో.. ఆపరేషన్ అపోజీషన్(Operation Opposition) టార్గెట్ గా జిల్లాల పర్యటనకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సభలో పాల్గొనున్నారు. అదే విధంగగా పాలనా పరంగానూ సంక్షేమ పథకాల(Welfare Schemes)ను మరింత మందికి విస్తరించే విధంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తొలి నుంచి నమ్ముకున్న ఓట్ బ్యాంక్(Vote Bank) ను మరిం సుస్థిరం చేసుకొనే ఆలోచనలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్షం ప్రస్తుతం పరిస్థితుల నుంచి కోలుకొనే సమయంలోనే పూర్తిగా పై చేయి సాధించి..ప్రజల మద్దతు పొందుతూ..పార్టీని ఎన్నికలకు సిద్దం చేయటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి(CM Jagan) కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+